5.1 C
New York
Sunday, April 2, 2023
HomeEntertainmentMovie Updatesడార్క్ కామెడీ "క్షణ క్షణం".

డార్క్ కామెడీ “క్షణ క్షణం”.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

మన మూవీస్ బ్యానర్ లో ఉదయ్ శంకర్ జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో నిర్మించిన సినిమా క్షణ క్షణం. టైటిల్ కి తగ్గట్టుగానే ఆద్యంతం ఉత్కంఠంగా సాగే ఈ మూవీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ పొందింది.
డార్క్ కామెడీ జానర్ లో సాగే ఈ సినిమా ఈ నెల 26న విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ:
‘ మా సినిమాకు సెన్సార్ వాళ్ళు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 26న విడుదల చేస్తున్నాము. ‘క్షణ క్షణం’ తప్పకుండా మా టీంకి పెద్ద సక్సెస్ అందిస్తుందనే నమ్మకం ఉంది. డార్క్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. పాటలు బాగా వచ్చాయి. ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలను ఆదరిస్తున్నారు. మా సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ నందిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

దర్శకుడు కార్తిక్ మేడికొండ మాట్లాడుతూ: ‘ క్షణ క్షణం’ ప్రేక్షకుల్ని ఎక్కడా రిలాక్స్ కానివ్వదు. పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. రియలిస్టిక్ గా సినిమాను మలిచాము. పాత్రలకు చాలా తొందరగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ప్రతి పాత్ర చాలా సహాజంగా ఉంటుంది. మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందనే నమ్మకం ఉంది. సినిమా సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ అందుకుంది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. ’ అన్నారు.

ఉదయ్ శంకర్ ,జియాశర్మ హీరోహీరోయిన్లు గా నటించే ఈసినిమా లో శ్రుతిసింగ్ మ్యూజిక్ దర్శకుడు కోటి ,రఘుకుంచె , రవి ప్రకాశ్, గిఫ్టన్ ఇతర ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

టెక్నీషియన్స్ : డిఓపి: కె. సిద్దార్ద్ రెడ్డి, మ్యూజిక్ : రోషన్ సాలూర్ , ఎడిటర్: గోవింద్ దిట్టకవి, పి.ఆర్. ఓ : జియస్ కె మీడియా, నిర్మాతలు : డాక్టర్ వర్లు, మన్నం చంద్ర మౌళి దర్శకుడు : మేడికోండ కార్తిక్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments