కేశవరావు జాదవ్ (జనవరి 27, 1933 – జూన్ 16, 2018) తెలంగా ణ ప్రత్యేక రాష్ట్ర తొలి ప్రతిపాద కులలో ఒకరైన ప్రముఖ సీనియర్ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవ రావు జాదవ్. తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంతో పాటు తెలంగాణ తొలి, మలి దశ ఉద్య మాలలో చురుగ్గా పాల్గొన్న నిఖార్సయిన నాయకుడు. తొలి తరం తెలంగాణ ఉద్యమ కారుని గా, అణగారిన వర్గాల పక్షపాతిగా, పౌరహక్కుల సంఘం నేతగా గుర్తింపు పొందాడు.
పత్రికా రచయితగా, సంపాదకునిగా, చరిత్రకారుని గా, కవిగా, హక్కుల ఉద్యమకారునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, ‘లోహియా విచార్ మంచ్’ స్థాపకు నిగా, ‘సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి’ స్థాపకునిగా, సోషలి స్టు ఉద్యమ నాయకునిగా ఆయన కృషి, పట్టుదల, అకుంఠిత కార్య దీక్ష, రాజీలేని పోరాట పటిమ మరవ లేనివి.
కేశవరావు జాదవ్ 1933, జనవరి 27న శంకర్రావు, అమృత దంపతులకు హైదరాబాదు పాత బస్తీ లోని హుస్సేనీ ఆలంలో జన్మించాడు.
ఎమర్జెన్సీలో హైదరాబాద్‌లో మొట్ట మొదటి అరెస్టు జాదవ్ దే కావడం గమనార్హం. 1952 నాన్ మూల్కీ గో బ్యాక్ ఉద్యమాన్ని నిర్వహించిన వారిలో ప్రముఖుడైన కేశవరావు 1975 ఎమర్జెన్సీ సమయంలో 18 నెలలపాటు జైలు జీవితాన్ని అనుభవించాడు. తెలం గాణ పోరాటంలో 1960, 70 దశకా ల్లో విశేషమైన పాత్ర పోషించిన ఆయన, తెలంగాణ ప్రజలకు జరిగి న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను సంఘటితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ స్థాపించాడు. ఒలింపస్’ అనే పత్రికను తెలంగాణ ఉద్యమానికి, విద్యార్థుల కార్యక్రమాలకు బాసటగా నిలుస్తూ వెలువరిం చాడు. 1969 ఉద్యమంలో క్రియా శీలకంగా పని చేశాడు. 1952 ముల్కీ ఉద్యమం నుంచి పోరాటం మొదలై, ఉపాధ్యాయ ఉద్యమా లలో భాగస్వామి అయినాడు.
2006లో తెలంగాణ జన ఐక్య కార్యాచరణ సమితి, 2008లో తెలంగాణ జన పరిషత్‌లో కీలక పాత్ర పోషించాడు. టు వర్డ్స్ మ్యాన్ కైండ్ (ఇంగ్లీషు), యువ పోరాటం (హిందీ) పత్రికలను నడి పాడు. భాషా సమస్య, మార్క్స్- గాంధీ- సోషలిజం (ఇంగ్లిష్), లోహి యా ఇన్ పార్లమెంట్ పుస్తకాలను వెలువరిం చాడు. నక్సల్స్ కు, ప్రభు త్వానికి మధ్య జరిగిన చర్చలలో కీలక భూమిక పోషించాడు. అట్ట డుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్‌కు కేశవరావు నాయ కత్వం వహించాడు. తెలంగాణ మలి దశ ఉద్యమం లోనూ జేఏసీ ద్వారా జయశంకర్, కోదండ రామ్‌తో కలిసి కేశవరావు జాదవ్ పని చేశాడు. ఆయన పౌరహక్కుల సంఘం అధ్యక్షునిగా, తెలంగాణ జన పరిషత్ కన్వీనర్‌గా బాధ్యత లు నిర్వర్తించాడు. సోషలిస్టు నాయకుడు లోహియా అనుచరు డిగా జాదవ్‌కు గుర్తింపు ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీషు విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన కేశవరావు జాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
తెలంగాణ ప్రజలకు జరిగిన సవతి తల్లి ప్రేమను ఎదిరించాడు. నిరసించాడు. ఒకనాడు నైజాం ఏలుబడిలో ప్రాంతీయులకు ఇంగ్లీష్ భాష రాదని ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి మద్రాసీ, బెంగాలీ, ఉత్తర భారతీయులను వేల సంఖ్యలో తీసుకువచ్చి ఉద్యోగాలు ఇవ్వడం, ఈ తతంగం ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కూడా కొనసాగిన నేప థ్యంలో… కేశవ రావు తన నిరసన గళాన్ని ఎత్తి వినిపించాడు. “మొద టి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు తెలుగు అర్థమవు తుందని, తెలుగు రాయ గలరనీ, చదవ గలరనీ, అట్లాంట ప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇంగ్లీష్‌లో ఎందుకు సాగాలనీ? అంతా ఇంగ్లీష్ లోనే సాగాలి అనుకున్నప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం ఏమిటని ప్రశ్నించా డు. రమీజాబీ ఉదంతానికి నిరసన గా ఉద్యమాలు నిర్వహించాడు. 1968 నుంచి చనిపోయే నాటి వరకూ తెలంగాణ ఉద్యమంతో మమేకమయినాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరగాల్సిన పనుల గురించి గొంతు వినిపిస్తూనే ఉన్నాడు. చెన్నారెడ్డి లాంటి నాయకులతో విభేదించాడు. చెన్నారెడ్డికి పోటీగా ‘సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి’ అనే పార్టీని స్థాపించిన వారిలో జాదవ్ కూడా ఒకరు.
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా, పీయూసీఎల్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా, పౌర హక్కుల సంఘం అధ్యక్షునిగా, తెలంగాణ జనపరిషత్ కన్వీనర్ గా, సోషలిస్టు నాయకుడు లోహియా అనుచరు డిగా గుర్తింపు పొందాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కేశవరావు 2018, జూన్ 16న మరణించాడు.