5.1 C
New York
Tuesday, March 21, 2023
Homespecial Editionఅపర భగీరథుడు.. కల్వకుంట్ల చంద్రుడు

అపర భగీరథుడు.. కల్వకుంట్ల చంద్రుడు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

తెలంగాణలో, కోటి ఎకరాలకు సాగునీటిని అందించే, బృహత్ లక్ష్యంలో భాగంగా, మానవ నిర్మిత మహాద్భుత ప్రాజెక్టు నిర్మాణం, రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి జలాలను ఎత్తి పోస్తూ, శ్రీరాంసాగర్ జలాశయం నింపడం, ఇంటింటికీ త్రాగునీరు అందించడం లాంటి అనూహ్య కార్యక్రమాల ద్వారా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ “అపర భగీరథుడు”గా పదే పదే కీర్తించ బడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోనే కాక, ఇతర ప్రాంతా లలో, రాష్ట్రంలో అధికార, విపక్షీ యులలో, సామాన్య ప్రజానీకం నోళ్లలో విస్తృతంగా నానుతున్న పదం “భగీరథ”. ఇంతకు “మిషన్ భగీరథ” పేరు ఎందుకు పెట్టారు? కెసిఆర్ కు “అపర భగీరథ” పర్యాయపదం వాడుతుండడంపై మిషన్ భగీరథ పద వినియోగం పై సర్వత్రా చర్చలు, సందేహాలు వ్యక్తమవు తున్నాయి. ఒకసారి సదరు నేపథ్యాన్ని పరిశీలిస్తే…. భరత ఖండాన్ని ఏలిన షట్చక్రవ ర్తులలో ఒకరైన సగరుని ముని మనుమడే “భగీరథుడు”. సగర చక్రవర్తికి కేశిని, సుమతి అని ఇరువురు భార్యలు ఉండిరి. కేశిని సుతుడు అసమంజసుడు కాగా, సుమతి కుమారులు 60వేల మంది. సగర చక్రవర్తి 99 అశ్వమేధ యాగాలు పూర్తిచేసి, నూరవ యాగం చేసే సమయాన, నూరు పూర్తయితే, “ఇంద్రపదవి” పొందగలడని భయకంపితుడై, ఇంద్రుడు యాగాశ్వాన్ని, తపో నిష్ఠలో నిమగ్నమై ఉన్న, కపిల మహర్షి వద్ద కట్టేసి వెళతాడు. సగరుని కుమారులు 50 వేల మంది యాగాశ్వాన్ని వెతికే పనిలో దానిని పాతాళంలో కనుగొంటారు. అశ్వాన్ని తెచ్చింది కపిల మహర్షి అని భావించి, ఆయనను దుర్భాష లాడుతూ, తపోభంగం కలిగిస్తారు. తద్వారా కపిల మహర్షి క్రోధాగ్నికి బలై భస్మమైపోతారు. యాగాశ్వం కోసం వెళ్ళిన కుమారులు రాక పోయే సరికి, సగరుడు తన పౌత్రుడు అసమంజసుని, పుత్రు డైన అంశుమంతుని వెదక పంపగా, ఆయన పాతాళంలో చితాభస్మపు గుట్టను చూసి, బాధపడి, పవిత్ర గంగా జలాల స్పర్శతోనే, వారికి పూర్వ లోక ప్రాప్తి కలగ గలదని, అశరీరవాణి ద్వారా తెలుసుకొని వెను తిరుగుతాడు. సగరుడు, అంశుమంతుడు, తర్వాత దిలీపు డు రాజ్యాన్ని పాలించారు. అనం తరం దిలీపుని కుమారుడు భగీరథుడు పిన్నవయసులో రాజ్యా ధికారం చేపట్టి, తమ పూర్వీకులకు సద్గతుల ప్రాప్తి కలగలేదని, తల్లి ద్వారా తెలుసుకొని, “ఆకాశ గంగ” ను, భూమి మీదకు తీస్తానని చెప్పి వెళ్లి, లక్ష్య సిద్ధికై, బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుని కోరిక నెరవేరగలదు అని, అయితే ఆకాశం నుండి, మహోధృతంగా కిందికి దూకనున్న గంగ, భువి పైన పడితే జరగనున్న పరిణామాలు కష్టమని, ఈశ్వరుని ప్రసన్నం చేసు కోమని, మార్గోపదేశం చేయడం జరుగుతుంది. భగీరథుడు మరో సారి, పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి, తిరిగి ఘోర తపమాచరించి సఫలీకృ తుడవుతాడు. తత్ఫలితంగా శివుడు, దివి నుండి దూకిన సుర గంగకు, తన జటాజూటాన్ని ఆధా రంగా, ఆసరాగా చేయగా, ఆకాశ గంగ శివగంగగా మారి, దివి నుండి భువికి దూకి భగీరధుని వెంట పరుగులు తీస్తుంది. దారిలో జాహ్న ముని ఆశ్రమంలో చిందులు వేయ గా, ఆయన కోపగ్రస్తుడై, అమాంతం గంగను ఔపోసనం పడతారు. ఇంత శ్రమకోర్చి తీసుకెళుతున్న గంగను, జాహ్న ముని తాగడంతో, బాధ పడి, అయినా పట్టు వీడక, భగీర థుడు, గంగను వదిలి వేయమని ప్రార్థించగా, జాహ్నముని తన చెవి ద్వారా గంగను వదులుతాడు. అలా “భగీరథి”, ” జాహ్నవి” గా పాతాళం చేరి, “పాతాళ గంగ” గా మారి, సగర పుత్రుల చితాభస్మం మీదుగా ప్రవహించి, వారికి సద్గతులు కలిగిస్తుంది. ఎంత కష్టం అయినా చలించక, లెక్క చేయక, అనుకున్నది సాధించే వారిని భగీ రథునితో, ఆ కఠోరశ్రమను, మొక్క వోని దీక్షను “భగీరథ ప్రయత్నం” తో పోల్చడం పరిపాటి. అసాధ్యమైన పనిని సుసాధ్యంగా చేయడం కోసం, లక్ష్య సాధనకై చేసే ప్రయత్నమే భగీరథ ప్రయత్నం.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో, మానవ నిర్మిత మహాద్భుత ఆవిష్కరణగా, సీఎం కేసిఆర్ మానస పుట్టువు కాళేశ్వరం ప్రపంచ రికార్డు నెలకొల్ప బోతోంది. ఇప్పటి వరకు అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్‌లో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు మాత్రమే ప్రపంచంలో అతి పెద్దవిగా రికార్డు ఉంది. 13 జిల్లాల్లో 18,25,000 ఎకరాలకు నీరందించే ఈ భారీ ఎత్తి పోతల ప్రాజెక్టు, అత్యంత ఖర్చుతో, అతి తక్కువ సమయంలో నిర్మిత మవుతూ, ప్రపంచాన్నే అబ్బుర పరుస్తోంది. కనివినీ ఎరుగని ఈ ఇంజినీరింగ్ అద్భుతం చాలా తక్కువ సమయంలోనే సిద్ధం కావ డం ఒక రికార్డు కాగా.. ప్రపంచం లోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ గా సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకోడానికి సంసిద్ధమవుతోంది. నిర్మాణం ఎంతో క్లిష్టమై, వందల గ్యాలన్ల నీటిని నది నుంచి తోడి ఎగువ ప్రాంతానికి పంపడానికి భారీ మోటార్లు వాడుతూ, ఎత్తుపల్లాలు అధికంగా ఉండే భూముల్లో, ప్రతి కూల పరిస్థితుల్లో, అవిశ్రాతంగా, ప్రతి ఒక్కరి సమిష్టి కృషితో, కెసిఆర్ స్వప్నాన్ని సాకారం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలోనే అతిపెద్ద నీటి నిల్వ కేంద్రం – దాదాపు 18 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌ – 4లో భాగంగా 6,805 కోట్ల నిధులతో, 50 టీఎంసీల సామర్థ్యంతో సిద్దిపేట జిల్లాలోని తొగుట – కొండపాక మండలాల శివారులో గుట్టల మధ్య నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ జలాశయంను ఫిబ్రవరి 21న ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రారంభించ నున్నారు. 30 టీఎంసీలు హైదరా బాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీటి కోసం,16 టీఎంసీల నీరు పారిశ్రామిక అవసరాల కోసం ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవు నా అందిస్తారు. తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి మల్లన్నసాగర్‌కు జలాశయానికి నీటిని తరలిస్తారు. ప్రస్తుతం మల్లన్నసాగర్‌ జలాశయం పూర్తి కావడంతో లింక్‌ 4లోని 12 నుంచి 19 ప్యాకేజీలకు సంబంధిం చిన పనులన్నీ పూర్తయినాయి. ఇలా అపర భగీరథుని స్వప్నం క్రమాను గతంగా సాకారం కాబోతున్నది. కాళేశ్వర మహా ప్రాజెక్టు రూప కల్పనాదిగా, అద్భుత నిర్మాణాలు, మహారాష్ట్రలో గోదావరి నదిపై, నిర్మించిన ప్రాజెక్టుల వల్ల, శ్రీరాం సాగర్ నిండని స్థితికి ప్రత్యామ్నా యంగా, గోదావరి నీటిని వివిధ దశల ద్వారా ఎత్తి పోస్తూ, ఎగువ మార్గంలో “వరద కాలువ” ద్వారా శ్రీ రామ్ సాగర్ జలాశయానికి, నిరంతరం నిండుతనం కలిగిం చడం, తదాది అనన్య సామాన్య అద్భుత ఆవిష్కరణలు, తెలంగాణ ప్రభుత్వాధినేతను “అపర భగీరథ” నామాలంకృతుల గావిస్తున్నాయి. గోదావరి నీటితో, తెలంగాణ ప్రజల దాహార్తి తీర్చడం, బంగారు పంటలు పండించడం లక్ష్యాల కోసం, కెసిఆర్ అకుంఠిత దీక్షా దక్షతలు, అంకితభావం, చేస్తున్న అనన్య సామాన్య కృషి ఫలితంగా, తెలంగా ణ తొలి, మలి ప్రభుత్వాధినేత “అపర భగీరథ” పదాంకి తులు కావడం అత్యంత సమంజసం.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments