Tuesday, August 9, 2022
HomeLifestylespecial Editionజానపద సినీ కథా నాయకుడు కాంతారావు

జానపద సినీ కథా నాయకుడు కాంతారావు


తెలుగు సినీ రంగంలో నందమూరి, అక్కినేనిల హవా నడుస్తున్న రోజు ల్లో, సినిమాలు పరిమితంగా నిర్మిస్తున్న కాలంలో మరో హీరోకి అవసరం ఉందన్న ఆలోచన సినీ పరిశ్రమ చెయ్యని వేళ ఆ టాప్ హీరోల తర్వాత హీరోగా గుర్తింపు పొందిన అందాల నటుడు, జాన పద హీరో, నాటి యువతుల కలల రాకుమారుడు కాంతారావు.

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు అంటే వెంటనే స్ఫురణకు రాక పోవచ్చు. కానీ కత్తి కాంతారావంటే తెలుగు నాట తెలియని వారుండరు. వెండి తెరపై జానపద కథా నాయకుడిగా టి.ఎల్.కాంతారావు వేసిన ముద్ర అలాంటిది. కత్తి పట్టిన జానపద వీరుడు అంటే ఇప్పటికీ కూడా మొదటగా గుర్తుకు వచ్చేది కాంతా రావే. విఠలాచార్య, కాంతా రావుల కలయిక అపూర్వం. ప్రేక్షకులకు గుర్తుండి పోయినప్పటికీ ఆయన పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో సైతం మంచి పాత్రల ద్వారా అరుదైన అభినయాన్ని చూపించారు. నార దుడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా కూడా నటించారు. ఎన్టీఆర్‌ రాముడిగా నటించిన ‘లవకుశ’ సినిమాలో లక్ష్మణుడిగా నటించిన కాంతా రావు, రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నారు. ఆయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరిం చింది. ఆయన స్వీయ చరిత్ర “అనగనగా ఒక రాకుమారుడు”.

తెలంగాణ లోని నల్గొండ జిల్లా కోదాడ ప్రాంతంలో గుడిబండ గ్రామములో 1923లో ఒక కరణీకపు కుటుంబంలో పుట్టి, వంశపారంపర్య పట్వారీ వృత్తిమీద కన్నా ముఖానికి రంగు వేసుకుని నటించటం మీద మక్కువ పెంచు కున్నాడు కాంతారావు. ఏడాది వయసులోనే తండ్రిని కోల్పో యారు. చదువుకునే రోజుల్లోనే నాటకాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆపై వెండితెరపైకి వచ్చి నటుడిగా, నిర్మాతగా కూడా మరపురాని సినిమాలను అందించారు. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘి క, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. హెచ్‌.ఎం. రెడ్డి తీసిన ‘నిర్దో షి’ (1951), ‘ప్రతిజ్ఞ’ (1953) మొదలుకుని 450కి పైగా సినిమా ల్లో నటించారు. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రాల్లో కథానాయకుడిగా ధీరోదాత్తంగా నటించి పేరు సంపాదించారు. నిర్మాతగా ‘సప్త స్వరాలు’, ‘గండర గండడు’, ‘ప్రేమ జీవులు’, ‘గుండెలు తీసిన మొన గాడు’ సినిమాలు తీశారు.

రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భా లలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో “తెలుగు చలనచిత్ర సీమకు రామారావు నాగేశ్వర రావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు.

ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరిం చింది. ఆయన మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. ఒక దశాబ్దంపాటు హీరోగా రెండవ హీరోగా ఎన్నెన్నో పాత్రలు పోషించారు. ‘నారదుడి’ పాత్రకు కాంతారావును తప్పించి మరెవరినీ ఊహించు కోలేనంతగా మెప్పిం చాడు. పౌరాణిక పాత్రలైన రాముడు, కృష్ణుడు పాత్ర ల్లోనూ ఎన్టీఆర్ తరువాత కాంతారావుగా గుర్తింపు జానపద హీరోగా కాంతారావుకు తిరుగులేదు.

కాంతారావు కుమారుడు రాజా, సుడిగుండాలు సినిమాలో నటించాడు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. యువ నటులు రావడం, జానపద చిత్రాలు తగ్గిన క్రమంలో, స్వయంగా సప్తస్వరాలు (1969); గండర గండడు (1969); ప్రేమ జీవులు (1971); గుండెలు తీసిన మొనగాడు (1974); స్వాతి చినుకులు (1989) తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహ రించారు. సినీ ప్రొడక్షన్ లో ఏ మాత్రం అనుభవం లేని కాంతా రావు స్వయంగా సినిమాలు తీసిన సమయాన 1969 నాటికి తెలంగా ణ రాష్ట్ర సాధన తొలిదశ ఉద్యమం సాగుతోంది. సినిమాలు ఆడే పరిస్థితి లేదు. ‘సప్త స్వరాలు’ ‘గండర గండడు’ వంటి సినిమాలు బాగున్నా ఆయన్ని ఆర్థికంగా ఆదుకోలేక పోయాయి. ‘ప్రేమ జీవులు’ సినిమా ఫ్లాప్. భారీ నష్టం. అయినా సినీ రంగంలోనే వెతుక్కో వాలని ఆ తర్వాత తీసిన మరో రెండు సినిమాలు కూడా లాభాలను చేతికి అందివ్వలేదు.

ఫైనాన్షియర్లకు వడ్డీలు కట్టటంతో సరిపోయింది. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఈ లోగా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలింది. పెరిగిన అప్పుల వల్ల చివరికి కట్టు కున్న ఇల్లును అమ్ముకుని, అప్పులు తీర్చి, ఒక చిన్న పెట్టెతో హైదరా బాద్ చేరారు.

చిరుపాత్రలు, టి.వి. సీరియళ్ళు చేశారు. నటుడిగా కాక, వ్యక్తిగతం గా చాలా ఇబ్బందులు పడ్డారు. ఏవయినా సభలకు పిలిస్తే ఇచ్చే డబ్బులు, సన్మానాలు చేసి ఇచ్చే డబ్బుల కోసం ఆశగా ఎదురుచూసే పరిస్థితి. ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదు. అతికష్టం మీద ఇచ్చిన రఘుపతి వెంకయ్య అవార్డు తప్పించి మరేమీ లేదు. అన్నీ నిరాశలే. చిట్టచివరి వరకు సొంత ఇంటికల కంటూనేవున్నారు.

అడపాదడపా సినీ పెద్దలు ఎవరయినా సహాయం అందించినా అది ఇంటికి సరిపోయేంత కాదు. ఇల్లు గడవటానికి సరిపోయేంత మాత్రమే. చివరికి క్యాన్సర్ బారిన పడ్డారు. అదీ ఆలస్యంగా గుర్తింపు.
ఏ దురలవాట్లూ లేక, ఎవరికీ హాని చేయని మనిషి ఒక్క సంవత్సరంలో శరీరాన్ని తినేసిన క్యాన్సర్ దెబ్బకు మరణించారు.

సినీరంగానికి వెలుపల స్నేహితులు ఉన్న వాడు కాదు కాంతారావు. తాను పుట్టి పెరిగిన సముద్రమే చేపను ఎత్తి అవతల వేస్తే అది ఎలా విలవిలా కొట్టుకుంటుందో, అలా సినీరంగమనే సముద్రపు ఆటు పోట్లకు బలైన రాకుమారుడు కాంతారావు. ప్రేక్షకుల మనసులో చెరగిపోని ముద్ర వేసిన కాంతా రావు, తన 85వ ఏట, 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాద్‌లో మరణించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments