నిజాం కబంధ హస్తాల నుండి హైదరబాదు సంస్థానం విముక్తి పొందడానికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ఉక్కు సంకల్పం గురించి తెలియని తెలంగాణ వారుండరు. తెలంగాణ విమోచన లేదా విలీన ప్రక్రియ వెనక మరో మేధావి, కార్యసాధకుని అకుంఠిత కృషి గురించి చాలా మందికి తెలియదు. ఆయనే కె. ఎం. మున్షీ. బ్రిటీష్ పాలకులు స్వాతంత్ర్యం ఇచ్చిన సమయంలో … మూడు సంస్థానాలు ఇండియాలో కలవలేదు. అవి కాశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ (నైజాం). ఆ పరిస్థితు ల్లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్… ప్రత్యేక శ్రద్ధ పెట్టి… జునా ఘడ్ సంస్థానాన్ని భారత్‌లో కలిసేలా చేశారు. నైజాం నవాబ్ మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు. అప్పట్లో రాజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేసిన ఖాసిం రజ్వీ… మారణకాండకు తెగ బడ్డారు. ఈ క్రమం లోనే “ఆపరేషన్ పోలో,” పేరుతో నాటి భారత హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ పటేల్ నేతృత్వంలో ” పోలీసు చర్య” చేపట్టడం జరిగింది.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, కె. ఎం. మున్షీకి హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో ట్రేడ్ ఏజెంట్ (ఏజెంట్-జనరల్) పదవి ఇవ్వ బడింది. మున్షీ జనవరి 5, 1948న హైదరాబాద్‌కు రావడంతో హైదరాబాద్ స్టేట్ రిసెప్షన్ మరియు బోలారమ్‌లోని ఇండియన్ ఆర్మీ యూనిట్ల గౌరవ గార్డుతో ఘనంగా జరిగింది. ఈ సమయంలో నిజాం తన రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ నుండి స్వతంత్రంగా ఉంచడానికి ప్రయత్ని స్తున్నాడు, సహాయం కోసం కొత్తగా సృష్టించబడిన పాకిస్తాన్‌కు రహస్య సంకేతాలను కూడా పంపాడు. ఇటువంటి కుట్రలు భారత యూని యన్‌కు ఎదురయ్యే అనివార్యమైన ప్రమాదాన్ని తెలుసుకున్న డాక్టర్ మున్షీ, నిజాం చేస్తున్న చర్యల గురించి సర్దార్ పటేల్‌కు తెలియ జేసేవారు. భారత గూఢచార దళం అంత పటిష్టంగా లేక. నిజాం సైనిక దళాలను గురించి సరైన అంచనా వేయలేక పోయారు. ఈ పనిని ఏజెంట్ “జనరల్ కే.ఎం. మున్షీ” సుగమం చేశారు. వారు, హైదరా బాద్ సైన్యంలోని ఒక అధికారిని లోబరచుకొన్నారు. అతని ద్వారా హైదరాబాద్ సైన్యపు వివరాలను స్పష్టంగానూ – ఖచ్చితంగానూ తెలిశాయి. ఈ సమాచారం భారత సైన్యానికి ఎంతో ఉపకరించింది. అంతే కాదు “జే.ఎన్. చౌదరి”కి హైదరాబాద్ సునాయాసంగా జయించగలం అన్న సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది.
కె.ఎం. మున్షీ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త మరియు భారతీయ విద్యాభవన్ స్థాపకుడు ప్రజాదరణ పొందిన నవలా రచయిత.
కన్నయలాల్ మాణిక్‌లాల్ మున్షీ (డిసెంబరు 30, 1887 – ఫిబ్రవరి 8, 1971) డిసెంబరు 30, 1887న ఇప్పటి గుజరాత్ రాష్ట్రంలోని బారుచ్‌లో జన్మించారు. బారుచ్, వడోదరలలో అభ్యసించి జాతీయో ద్యమంలో ప్రవేశించారు. 1937లో బొంబాయి రాష్ట్ర మంత్రిగా పదవి నిర్వహించారు. అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీలో సభ్యుని గా మున్షీ డా. అంబేద్కర్‌తో కలిసి ‘ప్రాథమిక హక్కుల’ సూత్రాన్ని వ్యక్తీకరించిన ముసాయిదాను సంయుక్తంగా రాయడం ద్వారా తన ముద్రను వేశారు.
సంస్థానాల విలీనీకరణ సమయం లో మొండికేసిన హైదరాబాదు నిజాంపై చర్యలు తీసుకోవడానికి భారతప్రభుత్వ దూతగా వచ్చిన మున్షీ సమస్యను చక్కగా పరిష్కరించి ప్రసిద్ధి చెందారు. భారత రాజ్యాంగ రచనలో కూడా భాగస్వాము లైనారు. ఆ తర్వాత జవహార్‌లాల్ నెహ్రూ మంత్రివర్గం లో ఆహార,వ్యవసాయ శాఖ మంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పని చేశారు. చివరి దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజగోపాల చారితో కల్సి స్వతంత్రపార్టీని స్థాపించారు.
సాహితీవేత్తగా రాణిస్తూ భారతీయ విద్యాభవన్‌ను ప్రారంభించారు.
1948 ఫిబ్రవరిలో నిజాం ప్రభుత్వాన్ని హస్తగతం చేసు కోవడానికి ప్రణాళికకు “పోలో” అని నామకరణం చేశారు. హైదరాబాద్ “పోలో” అనే ఒక క్రీడకు ప్రసిద్ధి. అందువల్ల దానికి “పోలో” ఆటలా సైనిక చర్య జరుపుతామని ఆ పేరు పెట్టారు. 1948 జూలై నెల చివరికంతా “ఆపరేషన్ పోలో” ఏర్పాట్లు – ప్రణాళిక సర్వమూ సిద్ధమ య్యాయి. 22వేల సైన్యానికి 22 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు సిద్ధమయ్యాయి. మేజర్ “జనరల్ జయంత్ నాథ్ చౌదరి” ఈ సైనిక చర్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా నియమితులయ్యారు.
పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది.1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టు బడ్డారు. తాను ఓటమి అంచుల్లో ఉన్నట్లు గమనించి నిజాం నవాబు దిక్కుతోచని స్థితిలో లేక్‌వ్యూ అతిథి గృహంలో బంధించిన భారత ఏజెంట్ మున్షీని కలిసి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దీనితో ఆపరేషన్ పోలో విజయవంతమైంది. సెప్టెంబర్ 13న జె.ఎన్.చౌదరి నాయకత్వాన ప్రారంభమైన దాడి సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగిపోవడంతో పూర్తయింది. ఆతని ప్రధానమంత్రి మీర్ లాయిక్ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించు కున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు.
మున్షీ 56 గ్రంథాలను రాశారు.
వెర్ని వసూలత్, స్నేహసంభ్రమ, భగ్న పాదుక, తపస్విని ఈ నవలలను మన దేశ భాషలకే కాక ఇతర దేశ భాషల్లోకి అనువదించారు. కాంగ్రెస్ పార్టీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ , మహాత్మగాందీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి ప్రముఖుల అభిమానాన్ని చూరగొన్నారు. 1971ఫిబ్రవరి 8న మరణించారు.