కల్పనాచావ్లా… భారతదేశ గర్వించ దగ్గ వ్యోమగామి. ప్రపంచ వ్యాప్తం గాఎందరికో స్పూర్తిగా నిలిచిన మహిళ.
అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ, అంతేకాక ఇండో – అమెరికన్ మహిళ వ్యోమగామి కల్పనా చావ్లా. పట్టుదల, కృషి, అంకితభావం ఉంటే సాధించ లేనిది ఏదీ ఉండదని ఆమె నిరూపిం చారు. ఎందరో యువతులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.
కల్పనా చావ్లా, భారత దేశం లో హర్యానా లోని కర్నాల్ అనే ఊరులో సంప్రదాయ శాఖాహార ఒక పంజాబీ కుటుంబం లో మార్చి17, 1962 లో పుట్టారు. తండ్రి బనారసీ లాల్ చావ్లా. సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కనేవాడు. తన గదిలో విమా నాల బొమ్మలుంచేవాడు. అవి కల్ప నలో స్పూర్తిని రగిలించాయి. కల్ప నా చావ్లా ముందుగా, కర్నాల్ లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు.
పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన కల్పనా చావ్లా ఎంఎస్ కోసం 1982లో అమెరికాకు వలస వెళ్లారు. 1982 లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ “ఏరోస్పేస్ ఇంజనీరిం గ్” లో మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని, అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వ విద్యాలయం నుంచి 1984 లో పొందారు.1986 లో, చావ్లా రెండవ మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి ని బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో విశ్వ విద్యాలయం నుంచి పొందారు. ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు మరియు విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసు కున్నారు.
భారత దేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్.డి. టాటా యే తనకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ను కెరీర్ గా తీసుకున్నానని చెపుతుండే వారు.
లింగ వివక్షతను అధిగమించి తల్లి సహకారంతో ఆమె తన కలలను సాకారం చేసుకున్నారు. కల్పన అంటే ఆలోచన లేదా ఊహా. చిన్న నాటి నుంచే ఆకాశంలో విహరిం చాలనే కోరికతో కల్పన తన పేరును సార్థకం చేసుకున్నారు.
టెక్సాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత, 1988లో కొలరాడో యూనివర్సిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్ పట్టాను స్వీకరించారు. 1988లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఏమ్స్ రిసెర్చ్ సెంటర్లో ఉద్యోగంలో చేరారు.
ఏడాది నాసా పరిశోధన కేంద్రంలో చేరిన కల్పన పవర్ లిఫ్ట్ కాంప్యూటే షనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ విభాగంలో వైస్-ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత నాసాకు వైస్-ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. 1991లో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది. తొలిసారిగా 1997లో కొలంబియా నౌక ద్వారా అంతరిక్ష యానం చేసిన కల్పనా చావ్లా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలో 376 గంటలు గడిపి భూమిచుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మైళ్లు తిరిగారు. అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళగానే కాదు, తొలి ఆసియా మహిళగానూ కల్పన రికార్డులకెక్కారు. తన మొదటి స్పేస్ మిషన్‌లో భాగంగా కొలంబి యా STS-87 అంతరిక్ష నౌకలో ప్రయాణించే టప్పుడు ఆమెఅప్పటి భారత ప్రధాని ఐకే గుజ్రాల్‌తో మాట్లాడారు. ఆ సమయంలో అంతరిక్షం నుంచి తీసిన హిమాల యాల ఫోటోలను గుజ్రాల్‌కు చూపించారు.
2003 జనవరిలో రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లి 16 రోజులు గడిపి 80 ప్రయోగాలను విజయ వంతంగా నిర్వహించారు.
భారత మూలాలు ఉన్న కల్పన 40 ఏళ్ల వయసులో, 2003లో చని పోయారు. 2003 ఫిబ్రవరి 1 న అంతరిక్షం నుంచి తిరిగివస్తూ ఆమె ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూమి వాతావరణం లోకి ప్రవేశిస్తు న్నప్పుడు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కల్పనతో పాటు ఆమె తో కలిసి ప్రయాణిస్తున్న మరో ఆరుగురు సిబ్బంది కూడా మరణిం చారు. కొలంబియా అంతరిక్ష నౌక షెడ్యూల్ ల్యాండింగ్‌కు 16 నిమిషాల ముందు అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో కూలిపోయింది.
ఆమె గౌరవార్ధం తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా పురస్కా రాన్ని 2003 నుంచి ఏటా ప్రకటిస్తోం ది. దీన్ని వివిధ రంగాల్లో 15 మంది శక్తివంతమైన మహిళకు అంద జేస్తుంది. కల్పన గౌరవార్థం దేశం లోని ఎన్నో విద్యాసంస్థలకు, అవార్డులకు ఆమె పేరు పెట్టారు. యువ మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభు త్వం 2004లో కల్పనా చావ్లా అవార్డును ఏర్పాటు చేసింది. భార తీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం 2003లో ప్రయోగించిన మెట్ శాట్‌కు కల్పనా చావ్లా పేరు పెట్టారు.
తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి. కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగీ, పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకూ టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రా న్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. తర్వాత డబ్బుకోసం బనారసీ కుటుంబం ఇబ్బంది పడింది లేదు. ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో పాదుకోవడానికి తండ్రేకారణం. “పరిస్థితులు ఎలాగున్నా… కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకు పోయాయి. అందుకు నాన్నే కారణం.” అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయిందీ కల్పన వివరించారు.
ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మీరు మనఃస్ఫూర్తిగా చేయాలను కోవాలి. ఎందుకంటె ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక,… దానిలో లీనమై అనుభవిం చాలి” అని యువతులకు సందేశం ఇచ్చేవారు.