జనరల్ కృష్ణారావు భారత ప్రసిద్ధ సైనిక అధికారులలో ఒకరు. ఆయ న దూరదృష్టి గలవారు. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో పాల్గొని అపూర్వ దైర్యసాహసాలు ప్రదర్శించారు. బంగ్లాదేశ్ విముక్తి సమయంలో ఆయన చేసిన సేవలు అసమానాలు. 1980 దశక ప్రారం భంలో భారత సైన్యాన్ని ఆధునీక రించడం ప్రారంభించారు. ఒక తరం సైనికులను ప్రేరేపించారు.
జనరల్ కె.వి. కృష్ణారావుగా ఖ్యాతి నందిన కొటికల పూడి వెంకట కృష్ణా రావు, జూలై 16 1923న విజయ వాడలో కె.ఎస్. నారాయణ రావు, లక్ష్మీరావు దంపతులకు జన్మిం చారు. ఆయన ఆగష్టు 9, 1942 న ఇండియన్ ఆర్మీలో చేరారు. 1947 లో విభజన వరకు, యువ అధికారి గా ఉన్నపుడే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్, బెలూచిస్తాన్ లలో ఆయన పని చేశారు. దేశ విభజన సమయంలో తూర్పు, పశ్చిమ పంజాబ్‌లలో విధులు నిర్వర్తిం చారు. భారత సైనిక దళాల మాజీ ఛీప్ ఆయ్యాక, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణీపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నరుగా పని చేసా రు. ఆయన జమ్మూ కాశ్మీరు గవర్న రుగా మొదటిసారి 1989 జూలై 11 నుండి 1990 జనవరి 19, రెండవ సారి 1993 మార్చి 13 నుండి 1998 మే 2 వరకు పనిచేసి చెరగని ముద్ర వేశారు. 1947 లో విభజన వరకు విస్తృతమైన పంజాబ్ అవాంతరాల సమయంలో, తూర్పు మరియు పశ్చిమ పంజాబ్ లలో పనిచేశారు.
1947 – 48లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక శిక్షకు లలో కృష్ణారావు ఒకరు. 1949 -51 మధ్య ఆయన డిఫెన్స్ అకాడమీలో పని చేశారు. 1965 – 66లో లడఖ్ లో ఒక దళానికి, 1969 – 70లో జమ్మూ ప్రాంతంలో ఇన్ఫాంట్రీ విభాగానికి కమాండర్‌గా వ్యవహ రించారు. 1970 – 72 మధ్య నాగాలాండ్, మణిపూర్లలో తిరుగుబాట్ల అణచివేత దళాలకు నేతృత్వం వహించారు.
1971 యుద్ధంలో రావు అందించిన సహకారం, దేశం యొక్క ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడం కోసం చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండి పోతుంది. ఆ కాలంలో, ఆయన విభాగం 1971లో భారత – పాకిస్తా న్ యుద్ధంలో కూడా పాల్గొంది. సిల్హెట్ ప్రాంతాన్ని స్వాధీనం చేసు కోవడంలో, ఈశాన్య బంగ్లాదేశ్ విముక్తికి కీలక పాత్ర పోషించారు. ఆ యుద్ధంలో కృష్ణారావు చూపిన ధైర్యం, సాహసోపేత నిర్ణయాలు, నాయకత్వ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పత కంతో సత్కరించింది.
1975 – 76 మధ్యకాలంలో, దేశ భవిష్యత్ రక్షణ కోసం పునర్వ్య వస్థీకరణ, ఆధునీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయన 1978-79 మధ్య ఆర్మీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా పని చేశారు. తదనం తరం, పదోన్నతి పొందారు. 1979 – 81 మధ్య కాలంలో వెస్ట్రన్ కమాం డ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్- ఇన్ – చీఫ్ గా పని చేశారు. కృష్ణా రావు జూన్ 1, 1981 న ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా నియమితులై, జూలై 1983 వరకు సమర్థ వంతంగా పని చేశారు. మార్చి 1982 నుండి జూలై 1983 వరకు సర్వీసులలో అత్యు న్నత నియామకం అయిన చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ కూడా అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా, బెలూచిస్తాన్ లలో పని చేశారు. దేశ విభజన సమయంలో తూర్పు, పశ్చిమ పంజాబ్‌ల్లో విధులు నిర్వర్తించారు. ఆయన ఆర్మీ ఛీఫ్ గా 1983 లో పదవీ విరమణ చేసారు. కృష్ణా రావు సేవలను గుర్తించిన కేంద్రం ఆర్మీ చీఫ్‌గా రిటైరైన అనంతరం ఆయనకు గవర్నర్‌గా అవకాశం కల్పించింది. 1984-89 మధ్య నాగాలాండ్, మణిపూర్, త్రిపుర గవర్నర్‌గా ఆయన పని చేశారు. మధ్యలో 1988లో కొంతకాలం పాటు మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తిం చారు. 1989 – 90 మధ్య, తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రాక్సీ యుద్ధం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, 1993 – 1998 మధ్య జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా తిరిగి పని చేశారు. ఉగ్ర వాదం, తిరుగు బాట్లతో అట్టుడికిన కశ్మీర్లో తిరిగి శాంతి నెలకొనేం దుకు కృషి చేశారు. ఆయన జనవరి 30 2016 న న్యూఢిల్లీలో మరణించారు.