ఆయనొక పోరాట యోధులు. స్వాతంత్ర్య పోరాటంలో భారత మాత దాస్య శృంఖలాల విముక్తి కోసం సర్వం త్యాగం చేసిన మేరు నగ ధీరులు. అలా అంటే ఆయన ఒప్పుకునే వారు కాదు. భరత మాత దాస్య విముక్తి కోసం రాజీ లేని పోరు సల్పిన అశేష దేశభక్తు లలో తామూ ఒకరమని అంటూ ఉండే వారాయన. ఆయనే ధర్మపు రి క్షేత్రానికి చెందిన స్వాతంత్ర్య సమర యోధులు, మాజీ మంత్రి కర్నె వెంకట కేశవులు (జననం 14-1-1924.. మరణం 30-1-2019). 1924 జనవరి 14న ధర్మపురి క్షేత్రంలో గోదావరి తీరాన గల తమ ఇంటిలో జన్మించిన కేశవులు, ధర్మపురి, కొత్తపల్లి, జగిత్యాల పాఠశాలలో విద్యా భ్యాసం గావించారు. జగిత్యాలలో 6వ తరగతిలోనే వందేమాతరం గీతాలాపన చేసి, శిక్షకు గుర య్యారు. అనంతర కాలంలో ధర్మపురి, ఆదిలాబాద్ ప్రాంతాలలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతి రేకంగా తిరుగుబాటు బాట పట్టి, స్వాతంత్ర్య ఉద్యమం గూర్చి మారుమూల గ్రామాలలో చైతన్య కాంతులు వెలిగించడంలో కృత కృత్యులైనారు. ధర్మపురి క్షేత్రంలో సాహిత్య, నాటక సంస్థల వ్యవస్థా పనలకు కారణభూతులై, సొంత ఇంటిలో గ్రంథాలయం నిర్వహిం చారు. నైజాం ఏలుబడి ప్రాంతంలో జాతీయ పతాకావిష్కరణలు నిషేధితాలు. కఠినతర నేరంగా పరిగణించాలని ఆదేశాలున్న నేపథ్యం తాము కోరుకున్న స్వాతంత్ర్యం సిద్ధించిన శుభ తరుణాన, ధర్మపురి క్షేత్రవాసు లందరినీ పిలిచి, మరీ తమ స్వంత ఇంటి పైనే జాతీయ జెండా ఎగుర వేసారు. నాటి పోలీసులు విషయం తెలిసి హుటాహుటిన నాన్ బెయిల బుల్ వారంట్ తో విచ్చేయగా, మరో అనుచరులు, పౌరాణిక ప్రసిద్ధులు సంగనభట్ల మాణిక్య శాస్త్రితో కలిసి, తమ ఇంటి ముందు నుండి ప్రవహిస్తున్న నిండు గోదావరిలో దూకి, బల్లకట్టు ద్వారా ఇరువురు మంచిర్యాల రేవుకు, తద్వారా రైలు ద్వారా ముంబాయి చేరుకుని, అజ్ఞాత వాసం గడిపారు. తర్వాతి కాలంలో సిర్పూర్ ఎమ్మె ల్యేగా, రాష్ట్ర చేనేత సహకార మంత్రిగా, స్వాతంత్య్ర సమరయో ధుల సంఘ వ్యవస్థాపక బాధ్యుని గా పని చేశారు.
కేశవులు జీవితంలో ఇది ఒక పార్శ్వం కాగా, తెలంగాణ లోనే మొదటిదైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి
నాటక సంస్థ 1936 ప్రారంభ దశలో మేకప్ మన్ గా, పాత్రాలంకరణ నిపుణులుగా, ప్రయోక్తగా, చింతా మణిలో భవానీ శంక రుడుగా, మధుసేవలో శర్మగా, రామదాసులో తానీ షాగా విభిన్న పాత్రలకు జీవం పోశారు. 1938లో ప్రధానంగా ఫిబ్రవరి 1వ తేదీన మంచిర్యాలలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ మహా సభలు నస్పూరు శ్రీరాజా మురళీమనోహర్ రావు అధ్యక్షు లుగా, కేవి కేశవులు కార్యదర్శిగా నిర్వహించారు. మండలి బాధ్యునిగా, కేశవులు ఆనాడు ధర్మపురి నాట్యమండలిచే శ్రీకృష్ణ తులాభారం సాంప్రదాయ పద్య పౌరా ణిక నాటకం వేయించారు. ప్రప్రథమ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్రపితామహ మాడ పాటి హన్మంతరావు, విమర్శ నాగ్రేసరులు సురవరం
ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామాను జరావు, కాళోజీ నారాయణ రావు, నార్ల వేంకటేశ్వర్ రావు, వానమామ లై వరదాచార్య తదితరులను ఆహ్వానింప చేసి, నాటక వీక్షణం గావింప చేశారు. నాటకం ఆసాంతం చూసిన ప్రముఖులు ఎంతగానో ప్రశంసించారు. ఇటీవల చివరిసారి ధర్మపురి స్వామి దర్శనం చేసుకు నేందుకు విచ్చేసిన సందర్భంగా, “తెలంగాణ ప్రభుత్వం కళా రంగానికి, కళాకారులకు అనేక ప్రోత్సాహ పథకాలను చేపట్టింది. పట్టణానికి దూరం కావడం వల్ల కొంతవరకు ఈ సంస్థకు కొంత నష్టం – ఒకింత అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నా. ఇప్పుడా లోపం తీనిపోతుందని ఆశి స్తున్నా” అన్నారాయన. కేశవులు తమ 97వ ఏట 2019 జనవరి 30వ తేదీన సాయంత్రం హైదరాబాద్, అమీర్ పేటలోని ధరంకరం రోడ్లోని తమ స్వగృహంలో కన్ను మూశారు.
