Wednesday, November 30, 2022
Homespecial Editionముద్రణా యంత్ర ఆవిష్కర్త గ్యూటెన్ బర్గ్

ముద్రణా యంత్ర ఆవిష్కర్త గ్యూటెన్ బర్గ్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

మానవ చరిత్రలో జరిగిన అనేక ఆవిర్భావాల్లో ప్రజల జీవన సరళినే కాకుండా మనసుల్ని, హృదయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక్క ముద్రణ విధానమే అని చెప్పవచ్చు. ముద్రణా విధానమే లేకుంటే మానవాళి ప్రగతి సాధ్యం అయ్యేది కాదు.

జూలియస్ సీజర్ అలెగ్జాండ్రియా నగరాన్ని ముట్టడించినపుడు అక్కడ ఉన్న గ్రంథాలయం కొంత వరకు ధ్వంసం అయినది. క్రీ.శ 390 లో ధియోఫిలన్ అనే క్రైస్తవ మత గురువు ఇక్కడి నుంచి కొన్ని పుస్తకాలను తరలించాడు. క్రీ.శ 642 లో మహమ్మదీయులు ఈ నగరం పై దండెత్తి వచ్చినపుడు కాలిఫ్ ఉమర్ గ్రంథాలయం కాల్చివేయమని సైనికులను ఆజ్ఞాపించాడు. సుమారు 4 లక్షల పుస్తకాలు మానవుని తెలివి తక్కువ తనానికి, ప్రతీకార వాంఛలకు బలైపోయాయి. ప్రాచీన సాహిత్య గ్రంథాలూ, జానపద గాథలూ, తరగని విజ్ఞాన సంపదా వాటిలో నిక్షిప్తంగా ఉండేవి. అవన్నీ రాత, బానిసల, పండితుల చేత చేతితో రాయబడ్డవే. ఒక పెద్ద గ్రంథాలయం నాశనం కావడంతో కళలకు, సాహిత్యానికి, వేదాంత విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన అపార జ్ఞాన నిధి తరువాతి తరాలకు శాశ్వతంగా దూరమైంది.

కానీ ఇలాంటి దుర్ఘటన ప్రపంచంలో మరెన్నడూ సంభవించ లేదు. లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం, వాషింగ్టన్ లైబ్రరీ కాంగ్రెస్, పారిస్ లోని “బిబ్లియోధెక్ నేషనేల్ ” సంపూర్ణంగా దగ్ధమైపోయినప్పటికీ, వాటి ప్రతులు ఇతరదేశాల లైబ్రరీల్లో నేడు లభ్యమవుతున్నాయి.

కాగితం తయారు చేయటానికీ, ముద్రణ విధానం ప్రవేశ పెట్టడానికీ శ్రీకారం చుట్టింది చైనీయులే, చైనా భాషకు సంబంధించిన సంకేతాలను కొయ్యపై చెక్కి, సక్రమంగా అమర్చి, వాటికి సిరా పూసి కాగితాలపై ఒత్తడంతో వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చైనా లిపిలో అక్షరాలుండవు. శబ్దానికి సంబంధించిన మాత్రా కాలాలకు (syllables) సంకేతాలుంటాయి. విడిగా ఉండే అచ్చులతో ముద్రించే విధానం చైనాలో 13 వ శతాబ్దంలోనూ, కొరియాలో 14 వ శతాబ్దంలోనూ ప్రారంభమైంది. అనేక శతాబ్దాలుగా దూర ప్రాచ్య దేశాల్లో బొమ్మలను ముద్రించే పద్ధతి నుంచి ఈ విధానం రూపొందిందని చెప్పవచ్చు. అచ్చుల సహాయంతో అక్షరాలను ముద్రించే విధానం ఈ నేపథ్యంలో
ప్రారంభమైంది. ఐరోపాలో కూడా ముద్రణ మొదట్లో బొమ్మలతోనే ప్రారంభమైంది. కొయ్య దిమ్మలతో పటాలను చెక్కే వారు. పశ్చిమ ఐరోపాలో కొందరు కొయ్య లేదా లోహంతో అక్షరాల అచ్చులను తయారుచేసి, ముద్రించటానికి అనుకూలంగా వాటిని పదాలుగానూ, వాక్యాలుగానూ మార్చి ముద్రించాలని ప్రయత్నించారు. దీనికి కావలసిన కాగితం తయారీ అరబ్బుల పుణ్యమా అని చైనా నుంచి ఐరోపా ఖండానికి తీసుకు రాబడి అందరికీ లభ్యంగా ఉండేది. చేతితో రాతల తయారీలు ఆశ్రమాల లోని సన్యాసులకు, మత గురువులకు, చర్చి అధికారులకు, విశ్వ విద్యాలయాల్లో ఆచార్యులకు మాత్రమే అందుబాటులో ఉండేవి.
అచ్చుల సహాయంతో అక్షరాలను ముద్రించే విధానం ఈ నేపథ్యంలో ప్రారంభమైనదని చెప్పవచ్చు.

ముద్రణ యంత్రం అనేది ఒక అచ్చు వేయవలసిన మాధ్యమం (కాగితం లేదా వస్త్రం) పై ముద్రణ సిరాతో అచ్చు వేసే యంత్రం.

జర్మనీలో మెయింజ్ కి చెందిన జోహన్ గ్యూటెన్ బర్గ్ అనేక కొత్త పద్ధతుల ద్వారా 1439లో ముద్రణ విధానానికి మెరుగులు దిద్దాడు.

జోహాన్స్ గుటెన్‌బర్గ్ (జోహాన్నెస్ గెన్‌ఫ్లీష్ జుర్ లాడెన్ జుమ్ గుటెన్‌బర్గ్) (1398 – ఫిబ్రవరి 3, 1468) జర్మనీకి చెందిన సంపన్న కుటుంబలో జన్మించాడు. చిన్నతనంలోనే స్టాన్న్ కొయ్య దిమ్మలతో ముద్రించటం చేర్చుకున్నాడు. అద్దాలకు మెరుగు పెట్టడం, రత్నాలకు సానపెట్టడం కూడా కొన్నాళ్ళూ చేశాడు. ఈ హస్త కళల్లో అనేక కొత్త పద్ధతులను కనిపెట్టాడు. అక్షరాల అచ్చులను విడిగా తయారుచేసి వాటిని పదాలుగా, వాక్యాలుగా కూర్చే ఆలోచన స్ట్రాన్ బర్గ్ లో ఉన్నపుడే ఆయనకు తట్టింది.

50 యేళ్ళ వయసులో తన జన్మస్థానానికి తిరిగి వచ్చి ఆలోచనల్ని ఆచరణలో పెట్టసాగాడు. ఒక్కొక్క అక్షరానికి ఒక అచ్చును తయారుచేసి, వీటి నుంచి ఒకే పరిమాణంలో ఉండే లోహపు అచ్చుల్ని తీర్చి దిద్దాడు. అప్పట్లో చేతితో రాయబడే అక్షరాలు కేవలం అలంకార ప్రాయంగా వున్నాయన్న కారణంతో ముద్రణకు సరిపోయేలా అక్షరాల తీరులో సరిక్రొత్త మార్పులు చేశాడు. అక్షరాలను కచ్చితంగా ఏర్పరిచే అచ్చులను తయారుచేసే సాధనాన్ని కూడా ఆయనే కనుగొన్నాడు. అచ్చులన్నిటికీ ఒకే పరిమాణంలో సిరా పూయటానికి మరో సాధనాన్ని, కావససినంత ఒత్తిడిని మాత్రమే కలగజేసే ఒత్తుడు యంత్రాన్నీ తయారు చేశాకనే అతడు ముద్రణకు పూనుకున్నాడు. వీటి నిర్మాణానికి
అయన ఎంతో శ్రమ పడ్డాడు.

తొలిసారిగా ఒక పాత జర్మన్ పద్యాన్ని ముద్రించి చూశాడు. ఇది తృప్తి కరంగా వుండటంతో లాటిన్ భాషలో బైబిల్ మొత్తాన్ని ముద్రించటానికి సాహసించాడు. ఒక పేజీకి 42 గీతలు చొప్పున 1282 పేజీలు గల ఆ గ్రంథాన్ని సరైన సదుపాయాలు లేని చిన్న సంస్థ ముద్రించటానికి పూను కోవటం నిజంగా సాహసమే! అనేక సంవత్సరాలు శ్రమించి అతడీ బృహత్కార్యాన్ని 1456 లో పూర్తి చేశాడు.

పని పూర్తయ్యే సరికి అతనివద్ద చిల్లిగవ్వ కూడా మిగలలేదు. ఇంత వరకు డబ్బు సమకూరుస్తూ వచ్చిన అతని భాగస్వామి తన వాటా వెంటనే యిచ్చివేయమని పట్టు బట్టాడు. గత్యంతరం లేక ఇంటినీ, వర్క్ షాప్ నీ, ముద్రించిన ప్రతులనూ గ్యూటెన్ బర్గ్ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. అతని శేష జీవితం ఎలా గడిచిందో తెలియదు కానీ పదేళ్ళ తరువాత ఓ చర్చి అధికారి తన ఇంట్లో ప్రశాంతంగా జీవితం గడపాలని గ్యూటెన్ బర్గ్ ని ప్రార్థించగా, అతడక్కడే వుండి రెండేళ్ళలో శాశ్వతంగా కన్ను మూశాడు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments