Jayamma Panchayati Review :
విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాష్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. సుమ కనకాల ముఖ్య పాత్రని పోషించిన ఈ చిత్రంలో దేవి ప్రసాద్, దినేష్ కుమార్, కదంబాల షాలిని, కొండెపూడి జాయ్, నికిత, గణేష్ యాదవ్, భువన్ సాలూరు ,గేదెల త్రినాధ్, అమ్మ రామకృష్ణ, మాయానంద్ ఠాకూర్ రెడ్డి మహేశ్వర రావు, డి హేమ తదితరులు నటించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మే 6, 2022 న విడుదలైంది. ఇక ఈ ‘జయమ్మ పంచాయితీ’ సంగతులేంటో చూద్దాం..
కథ :
జయమ్మ (సుమ) తన భర్త (దేవి ప్రసాద్) మరియు పిల్లలతో సంతోషంగా శ్రీకాకుళంలో గడుపుతూ ఉంటుంది. కానీ భర్తకి జబ్బు చేస్తుంది. దీనితో భర్తను చూసుకోవడానికి ఆమెకు డబ్బు అవసరం పడుతుంది. ఆమె తన సమస్యను పరిష్కరించుకోవడానికి గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆమె సమస్య విని అంతా ఆశ్చర్య పడతారు. అదే సమయంలో గ్రామ సభలు మరొక సమస్యను పరిష్కరించడంలో వుంటారు. అయితే మరి ఆఖరికి గ్రామ సభ జయమ్మ సమస్యను పరిష్కరించిందా..?, ఇంకో సమస్య ఏమిటి అనేది కధ..

విశ్లేషణ :
ఇన్ని సంవత్సరాలు యాంకర్ గా మనల్ని అలరించిన సుమ ఈ సినిమాతో నటిగా మన ముందుకు వచ్చారు. సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక పల్లెటూరి నేపథ్యంలో జరిగే సినిమా అని మనకి అర్థమవుతుంది. మనకి ముందు చూపించినట్టుగానే ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో ఉంటుంది. అందర్నీ ఆకట్టుకుంటుంది. అలానే ఈ సినిమా బాగా మొదలవుతుంది. ఈ చిత్రంలో పాత్రలను పరిచయం చేయడానికి దర్శకుడు ఎక్కువ టైం తీసుకున్నాడు. ఏది ఏమైనా ప్రేక్షకులు సినిమా అంతటా ఎంగేజ్ అవుతారు.
సుమ పాత్ర హైలెట్ గా ఉంటుంది. గ్రామీణ భావోద్వేగాలు బాగా వర్కవుట్ అయ్యాయి. కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అలానే పాత్రలు మరియు కథ మన జీవితంలో జరిగినట్టు ఉంటుంది. అనుష్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. జయమ్మ భర్తగా దేవి ప్రసాద్ పాత్రకి న్యాయం చేసాడు. కులం గురించి, పెద్దల పరువు గురుంచి కూడా బాగా తీశారు. ఓవర్ ఆల్ గా ఫస్ట్ ఆఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ఎక్కువగా ఉండడంతో సినిమాని సాగతీసినట్టు ఉంటుంది.

ప్లస్ పాయింట్స్ :
సుమ నటన, కామెడీ సన్నివేశాలు, గ్రామీణ భావోద్వేగాలు, సినిమాటోగ్రఫీ బావున్నాయి..
మైనస్ పాయింట్స్ :
సినిమాని సాగతీసినట్టు ఉంటుంది, బలమైన సంఘర్షణ లేదు
ఫైనల్ గా :
‘జయమ్మ పంచాయితీ’ సినిమాని ఒక్కసారి చూడొచ్చు. ఎక్కువ ఆశ పెట్టుకోకుండా వెళితే నచ్చుతుంది.