సినిమా రిలీజ్ అవ్వకముందే ఫుల్ పాజిటివ్ టాక్ ను సంపాదించిన జాతి రత్నాలు ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాన్నునది.ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం సెన్సర్ లో యు సర్టిఫికేట్ ను పొందింది.2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ లో 62 శాతాన్ని నమోదు చేసుకుని ఆరోజు రిలీజ్ అయ్యే చిత్రాలన్నింటికంటే ముందుంది.