కల్కి దగ్గర ఏం దొరకలే..దట..!
◆ ముగిసిన రెండో విడత విచారణ
◆ సమాచారం ఇచ్చి వచ్చారట
◆ సిగ్గు ఆనిపించడం లేదూ..!

వాళ్ళు కలియుగ దేవుళ్ళుగా పుష్కర కాలం రాజ్యమేలారు. ఎంత పెద్ద ముదుర్లు. వాళ్ళ ఆశ్రమాలు, ఆఫీసులపై ‘ఇంకా సమాచారం కోసం మళ్ళీ దాడులకు వస్తున్నాం’ అంటే ఏం చేస్తారు.
సరిగ్గా అదే చేశారు. చివరికి ఐటి అధికారులకు ఓ చిల్లిగవ్వ సమాచారం దొరకలేదు.
బయటకు చెపితే పరువు పోతుందని ‘కల్కి కరిచిన దొంగల్లా’ ఉన్నారు. మన ‘ఆదాబ్ హైదరాబాద్’ కన్నేసింది కదా..! అంతే.. ఇలా బయటకు లాగాం. ఆధారాలు కావాలి.. లేకుంటే రేపు దబాయిస్తారు కదా.. మొతం కెమెరాలో బంధించాం.
అర్థరాత్రి వరకు ఒకటే దాడులు:
కల్కి భగవాన్ ఆశ్రమాలపై తమిళనాడుకు చెందిన ఐటి అధికారుల బృందాలు మూకుమ్మడిగా ఏక కాలంలో దాడులు నిర్వహించాయి.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం కేంద్రంగా నడుస్తున్న కల్కి ఆశ్రమంలో నాలుగు ఐటి బృందాలు సోదాలు చేశాయి. తమిళనాడులోని ‘నేమం’ కల్కి ఆశ్రమంలోనూ ఐటి బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
కల్కి భగవాన్ ఆశ్రమానికి సంబంధించి అనుబంధంగా ఉన్న మరో 30 సంస్థల్లోనూ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కల్కి ఆశ్రమంలో ఐటీ అధికారుల విచారణ ముగిసింది.
శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తమిళనాడు ఐటీ అధికారులు విచారణ పూర్తి చేసుకుని వెనుతిరిగారు.

గతంలో..:
అక్టోబరు 16వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు కల్కి ఆశ్రమంలో దాడులు చేపట్టిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఉబ్బలమడుగు సమీపంలోని కల్కి ఆశ్రమానికి చెందిన వన్నెస్ క్యాంపస్ 1, 2, 3లలో ఐటీ అధికారులు రెండో విడత తనిఖీలు నిర్వహించారు.
దాదాపు నెల రోజుల విరామం అనంతరం మరోమారు సోదాలు నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తొలిసారి తనిఖీలు పూర్తయిన అనంతరం ఇక ఏ భయం లేదన్న ధోరణితో ట్రస్టు నిర్వాహకులు క్యాంపస్‌లలో రహస్యంగా ఉంచి,
ఇంకా పట్టుబడని ఏవైనా ఆస్తులకు సంబంధించి నగదు నిల్వలు ఉన్నాయన్న కారణంతోనే మరోమారు సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

34 చోట్ల ఏం దొరకలేదట..!:
కల్కి ఆశ్రమాలు, ఆఫీసులు కలిపి మొత్తం 34 చోట్ల ఐటి అధికారులు సోదాలు చేస్తే ఏం దొరక లేదట. ఓ చిల్లిగవ్వ సమాచారం కూడా దొరకలేదు.
ఎవరి చేవిలో ఇంకా ఎన్ని కాలిప్లవర్ పూలు ఎన్నాళ్ళు.. ఎన్నేళ్ళు పెడతారో చూద్దాం. సిగ్గు అనిపించడం లేదూ..!