5.1 C
New York
Sunday, May 28, 2023
Homespecial Editionవిశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన న్యూటన్

విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన న్యూటన్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


అధునిక సైన్సును కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు న్యూటన్. గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయనను ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు.

మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన “సర్ ఐజాక్ న్యూటన్” ఒక ఆంగ్ల భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఆయన ఓ సిద్ధాంత కర్త, తత్వవేత్త కూడా. ప్రకృతి సిద్ధమైన తత్వ శాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం ఆయనను “సైన్సు పితామహుడు”గా కీర్తించింది. ప్రపంచం లోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లలో రివ్వున దూసుకెళ్తున్నామంటే, అందుకే న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే కారణం.

విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ జనవరి 4, 1643వ సంవత్సరంలో ఇంగ్లండ్‌కు దగ్గర్లో గల ఉల్‌తోప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు.

న్యూటన్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేయటం లాంటి పనులు చేస్తుండేవారు. అలా చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారం లాంటివి కూడా ఆయన తయారు చేశారు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.

గణితంలో న్యూటన్ పట్ల ఎంతో ఆసక్తి చూసిన ఒక ఉపాధ్యాయుడు, న్యూటన్ ను ఉన్నత విద్యను అభ్యసించడానికి విశ్వ విద్యాలయానికి పంపండని న్యూటన్ తల్లికి గట్టిగా చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు న్యూటన్ విద్యకు అయ్యే ఖర్చును భరించటానికి అంగీకరించారు. న్యూటన్ జూన్
1661 లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్‌ విశ్వ విద్యాలయంలో చేరిన న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై మక్కువ పెంచుకున్నారు. చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్‌ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. లైబ్రరీ లో చాలా సమయం అతను పుస్తక పఠనంలో గడిపేవారు. పూర్తి సమయం లెక్కలు మరియు భౌతిక శాస్త్రం అభ్యాసానికే వినియోగించారు. ఒక్కొక్కసారి తిండి నిద్ర కూడా మరిచే వారు. న్యూటన్ యూనివర్సిటీలో గ్రీకు, లాటిన్, హిబ్రు భాషలను, లాజిక్, జ్యామితి మరియు త్రికోణమితి లను ఎంచుకున్నారు. లైబ్రరీలో న్యూటన్ తరచుగా మేధావులైన కెప్లర్ మరియు ఇతరులు రాసిన / తయారు చేసిన గొప్ప ప్రయోగాలపై అధ్యయనం చేసేవారు. ఆ తరువాత అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడైన న్యూటన్‌, 1667లో పరావర్తన దూరదర్శినిని నిర్మించి సంచలనం సృష్టించారు. ప్రొఫెసర్ న్యూటన్ విశ్లేషణాత్మక జ్యామితి, బీజగణితం, మరియు క్యాల్కులస్ రంగాలమీద తన దృష్టి సారించారు. బైనామినల్ సిద్ధాంతం, అనంతం సిరీస్ విస్తరణ కోసం కొత్త పద్ధతులు, fluxions యొక్క ప్రత్యక్ష మరియు విలోమ పద్ధతులు – ఇవీ ఆ కాలంలో ఆయన చేసిన ప్రధాన ఆవిష్కరణలు. న్యూటన్ 1665 నుండి 1666 వరకు కాంతి అధ్యయనం మీద దృష్టి కేంద్రీకరించారు.

భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వ శక్తి ఎలా పని చేస్తుందో వివరిస్తూ విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, గమన సూత్రాలను నిర్వచించారు.
గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించారు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఆయన పరిశోధన ఫలితాలే పునాదిగా ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాల మీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించారు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపారు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలిగి పోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్ స్టయిన్ వచ్చేదాకా మూడు దశాబ్దాల పాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధి పత్యంగా ఏలిన మేధావి ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తోనే ఉన్నాయి.

(1).మొదటి సూత్రము…
“బాహ్యబల ప్రయోగము లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటుంది”. ఈ వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు. (2).రెండవ సూత్రము… “ఒక వస్తువు ద్రవ్య వేగంలోని మార్పు ఆ వస్తువు పై ప్రయోగించిన బలానికి అనుపాతముగా ఉంటుంది. మరియు ఆ బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది”. (3).న్యూటన్ మూడవ నియమం…”చర్యకు ప్రతి చర్య సమనంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయును”.

భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ “ప్రిన్సిపియా మేథమేటికా” అనే గ్రంథాన్ని రచించారు. కాంతిపై న్యూటన్‌ చేసిన పరిశోధనల ఫలితంగా “దృశాశాస్త్రం” పుట్టింది.
మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించారు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ, గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపారు.

ఆయనకు 1672లో రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ లభించింది. అప్పటి వరకూ ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్‌ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్‌ను “భౌతిక శాస్త్ర పితామహుడు” అంటారు. 1705లో బ్రిటిష్‌ ప్రభుత్వం “సర్‌” అని బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటి నుంచి ఐజాక్ న్యూటన్ “సర్ ఐజాక్ న్యూటన్‌”గా పేరెన్నిక గన్నారు.
తరువాత కూడా ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన న్యూటన్ తన 85 సంవత్సరాల వయస్సులో మార్చి 20, 1727న మరణించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments