ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ లీగ్ అయిన ఐపిఎల్ 2021 కు సంబంధించిన ఆక్షన్ ఈరోజు చెన్నైలో జరగనున్నది.ఈ ఆక్షన్ లో స్టీవ్ స్మిత్,మాక్స్ వెల్ ,క్రిస్ మోరిస్ వంటి ఫారిన్ ప్లేయర్స్ కేదార్ జాదవ్,శివం దూబే,అర్జున్ టెండూల్కర్ వంటి దేశీయ కీలక ప్లేయర్స్ ఉన్నారు.వీరిలో ఎవరిని ఏ ఫ్రాంచైజ్ కొంటుందో అని ఫ్యాన్స్ ఈగార్ గా వెయిట్ చేస్తున్నారు.మొత్తం ఈసారి 8 టీమ్స్ కు కలుపుకొని 61 ఖాళీ స్లాట్స్ ఉన్నాయి.ఇందులో 22 ఫారిన్ ప్లేయర్స్ స్లాట్స్ ఉన్నాయి.ఇక గత ఏడాది భారత్,చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపిఎల్ అఫిషియల్ స్పాన్సర్ గా తప్పుకున్న వివో, ఈ ఏడాది ఐపిఎల్ అఫిషియల్ స్పాన్సర్ గా చేరింది.
భారీ అంచనాలు నడమ మొదలైన ఐపిఎల్ 2021 ఆక్షన్ లో ప్రస్తుతానికి ఈవెన్ లూయిస్,ఫించ్,విహారి,కేదార్ జాదవ్, కరుణ్ నాయర్,అలెక్స్ హెల్స్, జేసన్ రాయ్ అన్ సోల్డ్ గా మిగిలారు.
ఇక స్మిత్ ను 2 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ, షకిబ్ ను 3 కోట్ల 20 లక్షలకు కలకత్తా,మ్యాక్స్ వెల్ ను 14 కోట్ల 25 లక్షలకు బెంగళూరు,మోయిన్ అలీ ను 7 కోట్లకు చెన్నై,శివమ్ దూబే ను 4 కోట్ల 40 లక్షలకు,క్రిస్ మోరిస్ ను 16 కోట్ల 25 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.