సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప మూవీ ప్రేక్షకుల ముందుకు రెండు పార్ట్స్ గా రానున్నది.ఈ మూవీలో స్టైలిష్ స్టార్ సరసన నేషనల్ క్రష్ రష్మీక మందన్న నటిస్తుంది.తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో రష్మీక హీరోయిన్ గా కనిపిస్తుందట ఇక సెకండ్ పార్ట్ లో మరో హీరోయిన్ ఉండబోతుందని సమాచారం.
ఈమె ఎవరనే అంశంపై ఇంకా మూవీ యూనిట్ ఓ క్లారిటీకి రాలేదు.రష్మీక మందన్న కంటే ఆమెకే స్క్రీన్ టైం ఎక్కువ ఉండనున్నది.పుష్ప ఫస్ట్ పార్ట్ లో ఒక్క సాంగ్ మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయిపోయింది.ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ ను దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.ఇక పుష్ప సెకండ్ పార్ట్ విషయానికి వస్తే ఈ పార్ట్ షూటింగ్ దాదాపు ఇప్పటికే10 శాతం
పూర్తయింది.