5.1 C
New York
Saturday, June 3, 2023
HomeEntertainmentMovie Updatesమడ్ రేస్ చిత్రం `మడ్డీ`

మడ్ రేస్ చిత్రం `మడ్డీ`

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. ప్రేక్షకులకు 4×4 వినూత్న సినిమా అనుభవాన్ని అందించేలా రూపొందిన  ఈ చిత్రం ద్వారా డాక్టర్ ప్రగ‌ల్‌భ‌ల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ మూవీ టైటిల్‌లోగో, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి రిలీజ్ చేశారు. కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆఫ్ రోడ్ రేసింగ్ క్రీడల గురించి సినిమాపరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శాన్ లోకేష్ ఎడిటింగ్ భాద్య‌త‌లు స్వీక‌రించ‌గా హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్  సినిమాటోగ్రఫీ అందించారు. భారతీయ సినిమాల్లో కొత్త ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు మునుపెన్నడూ చూడని ఆలోచనలతో ప్రత్యేకమైన ప్రయోగాలు చేస్తున్న ఈ త‌రుణంలో ఒక దర్శకుడు తన తొలి చిత్రం కోసం 4×4 ఆఫ్-రోడ్ రేసింగ్‌ ను ఎంచుకోవడం విశేషం.
భారతదేశం యొక్క మొదటి 4×4 మడ్ రేస్ చిత్రం ‘మడ్డీ’ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉంది.  మడ్ రేసింగ్ అనేది ఆఫ్-రోడ్ మోటర్‌స్పోర్ట్ లో ఒక భాగం.  ఈ థీమ్ ఆధారంగా సినిమాలు రావ‌డం చాలా అరుదు. ఈ బహుళ భాషా చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు డాక్టర్ ప్రగభల్ దర్శకత్వం వహించగా  పికె 7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ‌ కృష్ణదాస్ నిర్మించారు. బురదలో సాగే రేసింగ్ తో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు అసమానమైన సినిమా అనుభవాన్ని అందిస్తుంది అన‌డంతో సందేహం లేదు. ప్రధాన పాత్రల కోసం అంద‌రినీ కొత్త వారినే ఎంచుకున్నారు దర్శకుడు డాక్టర్ ప్రగభల్. త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుండి రేసింగ్ పట్ల ఉన్న ప్రేమతో చాలాకాలంగా ఈ  క్రీడతో సన్నిహిత అనుబంధాన్ని కొనసాగించాడు. ఆయన ఐదేళ్ల పరిశోధన ఫలితమే ఈ చిత్రం.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ ప్ర‌గ‌ల్‌భ‌ల్ మాట్లాడుతూ  –  “కొత్త త‌ర‌హా  చిత్రాల‌ను ఎంక‌రేజ్ చేయ‌డంతో విజ‌య్ సేతుప‌తి గారు ఎప్పుడూ ముందుంటారు. ఆయ‌న చేతుల‌మీదుగా మా
మా మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ‌వ్వ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ప్ర‌ధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం గురించి ఉన్న‌ప్ప‌టికీ  ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్ర‌తి ఎమోష‌న్ ఈ మూవీలో ఉంటుంది. ఈ సినిమా కోసం రియ‌ల్ మ‌డ్ రేస‌ర్స్ బ్యాక్‌గ్రౌండ్ ప్లేయర్‌లుగా న‌టించారు. నేను ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇచ్చాను. ఈ సినిమా మేకింగ్‌లో నా ముందు ఉన్న గొప్ప సవాలు ఏమిటంటే, మడ్ రేసింగ్ వంటి క్రీడను దాని థ్రిల్ మరియు పంచ్ కోల్పోకుండా ప్రేక్షకులకు పరిచయం చేయడ‌మే.  మట్టి రేసింగ్ మరియు బురదలోని విన్యాసాలను వాస్తవికంగా చిత్రీకరించాం.  ఇది ప్రేక్షకులకు త‌ప్పకుండా  కొత్త అనుభూతినిస్తుంది.  మడ్డీకి అనువైన ప్రదేశాలను కనుగొనటానికి నాకు ఒక సంవత్సరానికి పైగా పట్టింది. సినిమాటోగ్రఫీ ఫ్రేమింగ్ కోసం మాత్రమే కాదు, ప్రదేశం చుట్టూ ఉన్నవారికి నిజమైన రహదారి 4 * 4 మడ్ రేస్ అంటే ఏమిటో తెలుసుకోవటానికి, నేను 2 రోజులు మడ్ రేస్ ఈవెంట్‌ను నిర్వహించాను. ఆర్టిస్టులు  ఏ డూప్ లేదా జూనియర్ స్టంట్ మేన్  లేకుండా సాహసోపేత విన్యాసాలు చేశారు.  మట్టి రేసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పూర్తిస్థాయి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభవాన్ని ఇస్తుంది.  కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. అలాగే శాన్ లోకేష్ ఎడిటింగ్, హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్  సినిమాటోగ్రఫీ అందించారు. త్వ‌ర‌లో మ‌డ్డీ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో
హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Makkal Selvan Vijay Sethupathi Unveils Title Logo & First Look Poster of India’s First 4×4 Mud Race Movie ‘MUDDY’

‘Muddy’ is India’s first off-road mud race movie, which offers the viewers a 4×4 innovative cinematic experience.
Debutant filmmaker Dr. Pragabhal is making his debut as Director with this innovative film.  Makkal Selvan Vijay Sethupathi unveiled the title Logo and First look poster of the film. Only a few knows about this mud racing. Dr Pragabhal has made extensive research to make this film. Music by Ravi Basrur, San Lokesh roped in for editing & cinematography by Hollywood fame K G Ratheesh.

In a time when newbie filmmakers are experimenting with unique, never-before-seen ideas in Indian cinema, Its not surprising when one hears about a filmmaker taking on 4×4 off-road racing through his debut film.
 MUDDY, India’s first 4×4 mud race movie is in the final stages of production. Mud racing is a form of off-road motorsport, and movies based on the theme are rare in cinema so far. That makes Muddy in the news.

The multi-lingual film is directed by newcomer Dr Pragabhal and bankrolled by Prema Krishnadas under the banner PK7 Creations. Muddy is conceived as an adventurous action thriller, which will offer an unparalleled cinematic experience for the viewers. The director has roped in fresh faces for the lead roles. Dr Pragabhal, the director, tells us Muddy was born out of his love for adventure and off road racing, although he hasn’t participated in the latter. He has maintained a close association with the sport for a long time. The film is the result of his five year research.

” Vijay Sethupathi Garu always stands first to encourage new genre films. I am very glad that the first look of our film is launched by him.
Its mainly about the rivalry between different teams, There’s a blend of revenge, family drama, humour, adventure….. everything.” Says Pragabhal, who picked new-comers for the main roles, with real racers filling up as background players. “I trained the main actors in off-road racing, we didn’t use any dupes. I wanted guys who were adventurous and willing to invest the necessary time and energy for the film.”

“The greatest challenge before me was introducing a sport like mud racing to the viewers without losing its thrill and punch,” director Pragabhal said in a statement.

As the concept of mud racing is new to Indian cinema, the team did not find any references for making Muddy, this also made the production more complicated. Mud racing and stunts in the mud were filmed realistically. This will be a new experience to the viewers, he added. Pragabhal took five years of preparation to make Muddy. Those who are in the lead roles spent two years to get real time experience in mud racing. Pragabhal has taken more than one year to find the suitable locations for Muddy and it has included more interesting and unrevealed locations as well. Finding the location was a huge task of the pre-production thus ended up with several dangerous yet scenic locations which weren’t  framed in any of the movies. There are 3 different patterns of Mud race in the movie which was choreographed by the Director himself through his intense research for years. Also Pragabhal used costly modified vehicles in the Movie to get the real Mud Race ambiance. “Not just for a cinematography framing but for the people around the location to know about what a real off-road 4*4 Mud Race is, I’ve conducted a Mud Race event for 2 days” added Pragabhal. They did the adventurous stunts without any dupe or junior stunt artists. According to the team this makes MUDDY a comprehensive action thriller in mud racing genre. In addition to emphasizing mud racing, Muddy also gives the audience a great story experience.
The film’s technical crew includes KGF fame Ravi Basrur for music, Ratsasan fame San Lokesh for editing, Colorist Ranga and Hollywood fame K G Ratheesh for cinematography.
Muddy’s teaser is expected to be released soon.

Lead Artists – Yuvan, Ridhaan Krishna, Anusha Suresh, Amit Sivadas Nair
Other Known Artists – Harish Peradi, I M Vijayan & Renji Panicker.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments