Thursday, December 8, 2022
Homespecial Editionభారత జలాంతర్గాములు

భారత జలాంతర్గాములు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

భారతీయ నౌకా దళం భారత సాయుధ బలగాలలో ఒక శాఖ. దేశ రాష్ట్రపతి దీనికి అధిపతిగా వ్యవహరిస్తారు. 5000 మంది నౌకా వైమానిక దళ సభ్యులు, 2000 మంది నౌకా దళ కమెండోలతోసహా యుధ్ధ సన్నద్ధంగా ఉండే 55,000 మంది సభ్యులు గలిగి ప్రపంచంలో 5వ పెద్ద నౌకాదళంగా వుంది. భారత నౌకా దళం 155 నౌకల్ని కలిగి ఉంది. ఆసియాలో జెట్ యుద్ధ విమానాల్ని కలిగి ఉన్న విమాన వాహక నౌకని, నడిపే ఏకైక నావికా దళం.

ఐ.ఎన్.ఎస్. షల్కి …1992 ఫిబ్రవరి 7న నౌకా దళంలో చేరిన రోజు, ఈ సందర్భంలో..భారతీయ నౌకా దళంలోని మన జలాంతర్గాములు గురించి…

భారత రక్షణ వ్యవస్థలో భాగమయిన భారత నావికా దళం (ఇండియన్ నేవీ) కేవలం దేశరక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది.

ఇండియన్ నేవీలో 16 సబ్‌మెరైన్‌లు (జలాంతర్గాములు) ఉన్నాయి. ఇందులో ఎక్కువ రష్యా, జర్మనీలనుండి కొనుగోలు చేసినవి. ఇందులో ప్రధాన మయినవి సింధుఘోష్ తరగతికి చెందినవి. ఈ తరగతిలో మొత్తం 10 సబ్‌మెరైన్‌లు ఉన్నాయి. వీటి బరువు 3,000 టన్నులు. ప్రతి సబ్‌మెరైన్‌లో 220 కిమీ దూరంలోపు ఉన్న నౌకల పైన ప్రయోగించ గలిగే మిస్సైళ్ళు ఉన్నాయి. ఈ సబ్‌మెరైన్‌లు సముద్రంలో 300 మీటర్ల లోతువరకు వెళ్లగలగి, 18 నాట్ల వేగంతో 45 రోజుల పాటు సముద్ర ఉపరితలాన్ని చేరుకోకుండా ప్రయాణించ గలవు. 1985 నుండి అణు సబ్‌మెరైన్‌లను నిర్మించడానికి కల్పాక్కం వద్ద ఉన్న అణు కేంద్రంతో కలసి నేవీ కృషి చేస్తున్నది. 2010 నాటికి 6,000 టన్నులు బరువు కలిగి, పూర్తి అణు సామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్‌ను, 2010-2025 నాటికి ఇలాంటివి మరో నాలుగు నిర్మించడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగింది.

భారత నౌకాదళం లోని అన్ని యుద్ధ నౌకలకు ముందు ‘ఇండియన్ నేవల్ షిప్’ (ఐ.ఎన్.ఎస్), జలాంతర్గాములకు ముందు ‘ఇండియన్ నేవల్ సబ్ మెరైన్ (ఐ.ఎన్.ఎస్.) ‘ అని చేరుస్తారు.

నీటిలో మునిగి ప్రయాణం చెయ్యగల వాహనం. వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం. జలాంతర్గామిని మొదటగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ఉపయోగించారు. జలాంతర్గాములు అనేక రకాలైన మిషన్లను చేపట్ట గలవు. యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్‌, యాంటీ- సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్‌ లేయింగ్‌, తీర ప్రాంతాల్లో నిఘా తదితర మిషన్లు చేపట్టవచ్చు.
భారత నౌకాదళంలో చేరిన కొన్ని జలాంతర్గాములు – వాటి తేదీల వివరాలు ఇలా ఉన్నాయి…
ఐ.ఎన్.ఎస్.సింధుధ్వజ్… 12 జన వరి,1987, ఐ.ఎన్.ఎస్. షల్కి …07 ఫిబ్రవరి 1992, ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ …30 ఏప్రిల్ 1986,
ఐ.ఎన్.ఎస్. షంకుల్ ….28 మే 1994, ఐ.ఎన్.ఎస్. సింధువీర్…11 జూన్ 1988, ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర…19 జూలై 2000,
ఐ.ఎన్.ఎస్. వగ్లి ….10 ఆగష్టు 1974, ఐ.ఎన్.ఎస్. వేల ….31 ఆగష్టు 1973, ఐ.ఎన్.ఎస్. శాతవాహన… 21 డిసెంబర్1974,
ఐ.ఎన్.ఎస్. షిషుమార్…22 సెప్టెంబరు1986, ఐ.ఎన్.ఎస్. సింధురాజ్ …20 అక్టోబరు 1987,
ఐ.ఎన్.ఎస్. సింధురత్న…19 నవంబరు 1988, ఐ.ఎన్.ఎస్. షంకుష్ …20 నవంబరు1986,
ఐ.ఎన్.ఎస్. సింధుకీర్తి …09 డిసెంబరు1989, ఐ.ఎన్.ఎస్. సింధు విజయ్…17డిసెంబర్1990,
ఐ.ఎన్.ఎస్.సింధు కేసరి… 19డిసెంబర్1988, ఐ.ఎన్.ఎస్.సింధు రక్షక్ …24 డిసెంబర్1997, ఐ.ఎన్.ఎస్ విరాట్…27 సంవత్సరాల సేవ తరువాత 2016 లో ఈ నౌకను నౌకాదళం నుండి విరమింప జేసారు. 2013 లో ఐ.ఎన్.ఎస్ విక్రమాదిత్య కమిషను కాకముందు, విరాట్‌యే భారత నౌకాదళపు ఫ్లాగ్‌షిప్ నౌక. పని విరమించే ముందు వరకూ ఇది ప్రపంచంలోనే అత్యంత పాత విమాన వాహక నౌక. 1959 లో బ్రిటిషు నౌకాదళంలో హెచ్ ఎం ఎస్ హెర్మెస్‌గా చేరిన ఈ నౌకను 1987లో భారత్ కొని, 1987 మే 12 న ఐ ఎన్ ఎస్ విరాట్‌గా పేరు పెట్టింది. ఐ.ఎన్.ఎస్వి విక్రమాదిత్య…విక్రమాదిత్య భారత్ రష్యా నుండి కొనుగోలు చేసిన విమాన వాహక నౌక. కీయెవ్ తరగతికి చెందిన అడ్మిరల్ గోర్ష్‌కోవ్ విమాన వాహక నౌకను విక్రమాదిత్యగా పునర్నిర్మించారు. ఇది 2013 లో భారతీయ నౌకాదళం లోకి ప్రవేశించింది.
ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (2013)…భారత్‌లో నిర్మించిన మొదటి విమాన వాహక నౌక. 2013 లో దీన్ని నిర్మించారు. ఇది తేలిక పాటి విమాన వాహక నౌక.
ఐ.ఎన్.ఎస్ చక్ర…అణు జలాంతర్గామి…ఐఎన్ఎస్‌ అరిహంత్‌ …నూక్లియర్‌ సబ్‌మెరైన్‌.
నూక్లియర్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించే సబ్‌మెరైన్ల కోసం ఇక్కడ సముద్ర గర్భంలో అధునాతన బెర్తులు రూపుదిద్దు కుంటున్నాయి.
విశాఖపట్నం కేంద్రంగా స్వదేశీ పరిజ్ఞానంతో తొలి నూక్లియర్‌ సబ్‌మెరైన్‌ అరిహంత్‌ నిర్మాణం జరిగింది. సముద్రంపైన, భూమిపైన యుద్ధం చేయగల ఐఎన్ఎస్‌ జలాశ్వతో పాటు అణు ఇంధనంతో పనిచేసే సబ్‌మెరైన్‌ ఐఎన్ఎస్‌ చక్ర ఇక్కడి నుంచే సేవలు అందిస్తోంది.
చైనా వద్ద 56 సబ్‌మెరైన్లు ఉండగా మన దగ్గర 14 మాత్రమే వున్నాయి. చైనా ఇప్పటికే ఐదు న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లను సమకూర్చు కోగా మనం తొలి న్యూక్లియర్‌ జలాంతర్గామి (అరిహంత్‌) నిర్మాణంలో ఉన్నాయి.

ఫ్రెంచ్‌ నావికాదళ రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్‌ఎస్‌ రూపొందించిన జలంతార్గములను భారత నేవీ ఫోర్స్ ప్రాజెక్ట్‌ 75లో భాగంగా ముంబైలోని మజగాన్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) నిర్మిస్తోంది. ఆరు స్కార్పీన్‌ క్లాస్ జలాంతర్గాము ల్లోని మొదటిదైన ఐఎన్ఎస్ కల్వరిని 2017 డిసెంబర్‌లో భారత నావికాదళం లోకి ప్రవేశ పెట్టారు. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ జలాంతర్గామి. 2017లో ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ ఖండేరి రెండవది కాగా.. మూడోది ఐఎన్ఎస్ కరంజ్ 2018 నేవీ దళంలో చేరింది. ఇక, నాల్గోది ఐఎన్‌ఎస్‌ వెలా 2019 నుంచి సేవలందిస్తుంది. శత్రు దేశాల క్షిపణులు, జలాంతర్గాముల కళ్లుగప్పే స్టెల్త్‌ సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రాజెక్ట్‌ 75లో భాగంగా రూపొందించిన ఐదో స్కార్పీన్‌ తరగతి జలాంతర్గామి ఇటీవలే మజగావ్ డాక్ వద్ద అరేబియా సముద్ర జలాల్లో జల ప్రవేశం చేసింది. ప్రస్తుతం సబ్‌మెరైన్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు జరుగు తున్నాయి. ఇందులో భాగంగా రాబోవు 30 సంవత్సరాలలో 24 సబ్‌మెరైన్‌లు నేవీ అమ్ముల పొదిలో చేరబోతున్నాయి. ప్రస్తుత మార్పులను బట్టి హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అన్ని దేశలలో భారత నావికా దళం అత్యంత బలమయినదిగా తయారవుతున్నదని చెప్పవచ్చు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments