తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ తెలంగాణలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లాల్సి ఉండగా.. అనుకోకుండా సీఎం కేసీఆర్‌కు జ్వరం రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మోడీ పర్యటనలో సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ఇక మోడీ పర్యటనను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూసుకోనున్నారు. సాయంత్రం వరకూ జ్వరం తగ్గితే.. చినజీయర్ ఆశ్రమంలో జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది