Wednesday, November 30, 2022
Homespecial Editionదివ్యాంగులకు చేయూత అందించడం మానవ ధర్మం

దివ్యాంగులకు చేయూత అందించడం మానవ ధర్మం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 3వ ఆదివారం నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవంను జరుపుకునే వారు.

గతంలో యుద్ధాలలో వికలాంగులైన సైనికులు మాత్రమే ప్రతి సంవత్సరము మార్చి 3వ ఆదివారము నాడు వికలాంగుల దినోత్సవము జరుపుకునేవారు. దానిని ఐక్యరాజ్య సమితిలో ఆమోదించి అన్ని రకాలుగా వికలాంగులైన వారందరు ప్రపంచ యావత్తు ఈ వేడుకలను నిర్వహించు కోవాలని ప్రతి సంవత్సరము మార్చి 3వ ఆదివారాన్ని “ప్రపంచ వికలాంగుల దినోత్సవము”గా ప్రకటించ బడినది. అలాగే 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరముగా ఐక్యరాజ్య సమితి ప్రకటించటం ఆ సంవత్సరములో ఎన్నో కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కలిపించి వారందరిని సమాజ అభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో 1976లో ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది. అలాగే, 1983 నుండి 1992 వరకు ఐక్యరాజ్య సమితి వికలాంగుల దశాబ్దంగా ప్రకటించింది.

ఎన్నో వర్గాల వారికి అనగా కార్మికులకు మేడే – మే 1వ తేదీన, పిల్లలకు చిల్ల్రన్ స్టే నవంబర్ 14వ తేదీన, మహిళలకు ఉమెన్స్ డే మార్చి 8వ తేదీన చివరకు ప్రేమికులకు వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14వ తేదీన ఇలా ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన తేది ఉంటే వికలాంగులకు మాత్రం నిర్దిష్ట మైన లేది. మార్చి 3వ ఆదివారం “ప్రపంచ వికలాంగుల దినోత్సవము” జరుపడం వలన ప్రతి సంవత్సరము ఏదో ఒక తేదీన రావడం వలన ఫలాన తేది నాడు వికలాంగుల దినోత్సవము అని గుర్తించ లేకపోవడం జరిగినది.

ఈ విషయమై 1994వ సంవత్సరము మొదటిలోనే ఐక్యరాజ్య సమితిలో మరొక పర్యాయం చర్చించి మార్చి 3వ ఆదివారం నాడు జరుపుతున్న “ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని” 1994 నుండి డిసెంబర్ 3వ తేదీనాడు “అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవముగా” జరపాలని ప్రకటించ బడినది. ఆ నాటి నుండి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరము డిసెంబర్ 3వ తేదీనాడు యావత్తు ప్రపంచములో నిర్వహించ బడుచున్నవి. 1995 వికలాంగుల హక్కుల చట్టం వచ్చినప్పటి నుండి వికలాంగుల సంక్షేమము మరియు అభివృద్ధి కై పలు పథకాలు ప్రవేశ పెట్టబడినవి. వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై,1998 నుండి ప్రతి సంవత్సరం వికాలాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపు కుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో 1981లో ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ ఏర్పాటు చేయడం, తరువాత 1983లో వికలాంగుల సంక్షేమ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది.
వాస్తవానికి ఆంగ్ల భాషలో హ్యాండి క్యాప్ డ్, డిజేబుల్ద్, ఫిసికల్లీ ఛాలెం జ్డ్ అని రక రకాల పదాలు వాడుతున్నా, తెలుగులో అంగవికలులను “వికలాంగులు” కాకుండా “దివ్యాంగులు”గా పేర్కొనడం సమంజసంగా భావించి, సాధ్యమైనంత వరకూ వికలాంగులు అనే పదం వాడుక భాషలో తీసేసి, అలాగే దివ్యాంగులు పదమే వాడుతున్నారు.

సమాజంలోని దివ్యాంగుల పట్ల స్వాభావిక గౌరవం, వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి, వివక్షత లేని సమాజం, అవకాశాల సమానత్వం, అవరోధ రహిత వాతావరణం నిర్మాణం కొరకు, దివ్యాంగుల హక్కులకు కలుగ జేయడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో దివ్యాంగుల హక్కుల చట్టాన్ని రూపొందించింది.

దీన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల హక్కుల నియమాలు 2018లో రూపొందించారు.

ఈ చట్టంలో భాగంగా దివ్యాంగులకు అన్ని రంగాలలో సమానత్వం కల్పించడానికి ప్రత్యేక హక్కులతో పాటు 5% రిజర్వేషన్ కల్పించారు. వారి స్వాలంబనకై తెలంగాణ రాష్ట్రం లో తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు ఏడు లక్షల 30 వేల దివ్యాంగులకు ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నది.

అలాగే వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో వెళ్లడానికి అవరోధ రహిత వాతావరణం కల్పించుటకు,
అన్ని సంస్థల్లో ర్యాంపులు నిర్మాణమే గాక అచట దివ్యాంగులు ఉపయోగించుకునే
మూత్రశాలలు, వీల్ చైర్ లు ఏర్పాటు చేయడానికి ఈ చట్టం వీలు కల్పించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
దివ్యాంగులు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించడానికి స్వయం ఉపాధి పథకం కింద 60 శాతం నుంచి 80 శాతం వరకు సబ్సిడీతో రుణాలు మంజూరు చేయడం జరుగుతున్నది.

దివ్యాంగులకు వారి కార్యక్రమాలు నిర్వహించడం కొరకు వారికి కావలసిన ఉపకరణాలను
అందజేయడం ఉచితంగా అందచేయడం జరుగుతున్నది.

ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతికను జోడించి అనేక అభివృద్ధి చెందిన ఉపకరణాలను కూడా అందజేయడం జరుగుతున్నది.

ఇందులో భాగంగా సంబంధిత మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో పైలెట్ ప్రాజెక్టుగా 390 మందికి దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిల్స్ ఉచితంగా అందజేయడం జరిగింది.

అలాగే కొవిడ్-19 ప్రారంభ పరిస్థితుల్లో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన సేవలు అందజేయడానికి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి
ఫోన్ చేసిన దివ్యాంగులకు
వారికి కావలసిన నిత్యావసర వస్తువులు మందులు ఉపకరణాలు, అలాగే వారికి కావలసిన అనుమతి పత్రాలను అంద జేయడానికి ఈ టోల్ ఫ్రీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. సీఎం కేసిఆర్ నేతృత్వంలో, సమక్షంలో సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి, సకలాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే, కల్యాణలక్ష్మి తోడు 1లక్షరూపాయల ప్రోత్సాహకంను అందజేస్తున్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments