మధుమేహం కంట్రోల్ లో లేదా..ఈ నాలుగు పదార్థాలు వాడితే చాలు.. | How to Control Diabetes| Diabetes prevention| Steps to Manage Your Diabetes for Life| Tips to Lower Blood Sugar Naturally

Date:


posted on Jul 24, 2023 9:30AM

డయాబెటిస్‌ను ‘సైలెంట్ కిల్లర్’ అని వర్ణించారు. అంటే ఇది శరీరాన్ని లోపల నుండి దెబ్బతీస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించకపోతే, మధుమేహ రోగులలో గుండె జబ్బులు, కళ్ళు, నరాలతో పాటు తీవ్రమైన కిడ్నీ-కాలేయం వ్యాధుల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మధుమేహం సమస్య ఉన్నవారు చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చక్కెర స్థాయిలు  అదుపులో ఉన్నవారు ఆ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పడాలి.  చాలామంది మధుమేహం పెద్దవారిలో మ్రమే వస్తుందని అనుకుంటారు. కానీ మధుమేహం ఎవరికైనా వస్తుంది. ముఖ్యంగా  పిల్లల్లో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం  వేగంగా పెరుగుతోందని  వైద్యులు చెబుతున్నారు. అయితే కేవలం నాలుగు నాలుగు పదార్థాలు తీసుకుంటూ ఉంటే చక్కెర స్థాయిలు మ్యాజిక్ వేసినట్టు కంట్రోల్ లో ఉంటాయి. 

తిప్పతీగ..

 రక్తంలో చక్కెరను నియంత్రించడానికి,  మధుమేహం  సమస్యలను నివారించడానికి, ఆయుర్వేదంలో తిప్పతీగ ను సూచించారు.  ఇది  రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

నేరేడు..

నేరేడు పండు కూడా మధుమేహం సమస్యలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదంలో నేరేడు విత్తనాల పొడి, నేరేడు పండ్లు కూడా   మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో,  డయాబెటిక్ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడే  ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్,  పాలీఫెనాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది.

ఉసిరికాయ..

ఉసిరి  శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. విటమిన్-సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు ఉసిరికాయ తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.  ఇందులో యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉన్నాయి, ఇది ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరచడంలో,  ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మధుమేహంలో కనిపించే ఆక్సీకరణ ఒత్తిడి,  వాపును తగ్గించడంలో  కూడా సహాయపడుతుంది. 

 కాకరకాయ..

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తీసుకోవలసిన కూరగాయలలో కాకరకాయ తప్పనిసరిగా ఉంటుంది. చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాకరకాయలో చేదు గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరచడంలో,  ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది. కాకరకాయ రసం లేదా దాని గింజల పొడిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి

                            *నిశ్శబ్ద.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...