5.1 C
New York
Sunday, May 28, 2023
HomeLifestyleDevotionalhoroscope today 16 May 2023 ఈరోజు కర్కాటకం, తుల రాశులకు ధన యోగం..! మిగిలిన...

horoscope today 16 May 2023 ఈరోజు కర్కాటకం, తుల రాశులకు ధన యోగం..! మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే… – horoscope today 16 may 2023 daily astrology of zodiac signs in telugu

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

horoscope today 16 May 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు గురుడు రాశి అయిన మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై రేవతీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు గ్రహాలు, నక్షత్రాల ప్రభావం వల్ల కర్కాటకం, తులా రాశుల వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఈరోజున మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

-aries-horoscope-today

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో ఆందోళనలు పెరుగుతాయి. కొన్ని పనుల కారణంగా మీరు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కుటుంబ కలహాలు ముగిసే అవకాశం ఉంది. మీ తోబుట్టువులతో సంబంధాలలో మధురానుభూతి మిగులుతుంది. వ్యాపారులు ఈరోజు కొంత ప్రయాణం చేయొచ్చు. దీని వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనం కలుగుతుంది.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

Budhaditya Raja Yog నేటి నుంచి బుధాదిత్య రాజ యోగం.. ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు..!

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

-taurus-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు దానధర్మాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈ కారణంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి లేదా బంధువు ఏదైనా శారీరక సమస్యతో ఇబ్బంది పడొచ్చు. ఈరోజు దుబారా ఖర్చులకు, అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. సాయంత్రం నుంచి రాత్రి వరకు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు కూడా వెళ్లొచ్చు.

ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రాత్రి నల్ల కుక్కకు రొట్టె తినిపించాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

-gemini-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు ఆకస్మాత్తుగా భారీ మొత్తంలో డబ్బును పొందుతారు. ఈ కారణంగా మీకు ధైర్యం పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో కొంత ఆటంకాలు ఏర్పడొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత షాపింగ్ కూడా చేయొచ్చు. ఈరోజు మీరు ఆదాయం, ఖర్చులు రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. లేదంటే మీ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవ్వొచ్చు.

ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : హనుమంతుడికి తమలపాకులు సమర్పించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

-cancer-horoscope-today

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు సమాజంలో మీ కీర్తి, గౌరవం పెరుగుతుంది. ఈరోజు మంచి లక్షణాలు ఉండే వ్యక్తులతో మీ అనుబంధం పెరుగుతుంది. ఆర్థిక పరమైన విషయానికొస్తే ఖర్చులు పెరుగుతాయి.

ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

-leo-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారులు ఈరోజు కొంత ఒత్తిడిని అనుభవించాల్సి ఉంటుంది. ఉద్యోగులు పార్ట్‌టైమ్ పని చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమంతునికి పచ్చి మిర్చి సమర్పించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

-virgo-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులకు మంచి లాభాలు రావడంతో, వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మరోవైపు ఈరోజు మీరు మీ ఆదాయానికి మించి ఖర్చు చేస్తే, అది భవిష్యత్తులో ఇబ్బందిని కలిగిస్తుంది. మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. మీ బంధువుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.

ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమంతుడికి బూందీ సమర్పించాలి.

Baby Naming Ceremony మీ బిడ్డకు పేరు పెట్టడానికి ముందు ఇవి గుర్తుంచుకోండి.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి…!

తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

-libra-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు ఏ పనిలో అయినా సులభంగా పూర్తి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించడం కనిపిస్తుంది. మీరు ఈరోజు ఆస్తిని కొనుగోలు చేయబోతున్నట్లయితే, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే మీకు నష్టం రావొచ్చు. ఈరోజు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు చీమలకు పిండి పోసి, రావి చెట్టు దగ్గర నేతి దీపం వెలిగించాలి.

వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

-scorpio-horoscope-today

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీ తోబుట్టువులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మరోవైపు మీ శత్రువులు వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా పని చేయాలి. వ్యాపారులకు లాభం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటంతో కొంత ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు బదిలీ వాయిదా పడొచ్చు. మరోవైపు మీ కుటుంబంలో కొందరి వివాహం గురించి ఆందోళన చెందుతారు. మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

ఈరోజు మీకు 96 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమంతుడికి ఐదు మల్లెపూల దీపాలను వెలిగించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

-sagittarius-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు శారీరక, ఆర్థిక బలాన్ని పొందుతారు. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు కుటుంబ సభ్యుల అవసరాలను తీరుస్తారు. దీని వల్ల మీ ఖర్చులు మరింత పెరుగుతాయి. వ్యాపారులకు ఈరోజు ఒక సలహా అవసరం అవుతుంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు పిల్లలకు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

-capricorn-horoscope-today

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు భాగస్వాముల మధ్య వైరం కారణంగా ఈరోజంతా అసౌకర్యంగా ఉంటుంది. మీరు దుకాణం లేదా ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. మరోవైపు ఈరోజు శత్రువులు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారు మీ పురోగతిని చూసి కలత చెందుతారు. విద్యార్థులు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

-aquarius-horoscope-today

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు నిరంతరం లాభం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొన్ని వ్యాపార పర్యటనలు కూడా చేస్తారు. దీని వల్ల మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. విదేశాల నుంచి వ్యాపారం చేస్తున్న వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. అత్తమామల వైపు నుండి ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. అయితే మీకు ఈరోజు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు స్నేహితుని సహాయంతో రావాల్సిన బకాయిలను పొందొచ్చు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది.

ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుంతుడికి లడ్డూ సమర్పించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

-pisces-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు మానసి ఒత్తిడిని అధిగమించేందుకు ఓపికగా పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు పనిభారం పెరుగుతుంది. మీపైన బాధ్యతలు ఎక్కువవుతాయి. ఈ కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు తెలివితేటలు, గౌరవంతో సాయంత్రం వరకు అన్ని పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీకు ఏదైనా ఆస్తి సంబంధిత వివాదం ఉంటే, అది చట్టబద్ధం కావొచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది.

ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ఉపవాసం ఉండి సుందరకాండ పఠించాలి.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read Latest Astrology News and Telugu News
https://telugu.samayam.com/astrology/articlelist/57464974.cms

https://telugu.samayam.com/

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments