కరోనా కారణంగా చిత్రాలను రిలీజ్ చేయలేక,అలాగే వాటిని పైరసీ నుండి కాపాడుకోలేక, గుండెను గుప్పెట్లో పెట్టుకొని కాలం వెళ్ళబుచ్చిన నిర్మాతలు. ప్రస్తుతం థియేటర్స్ ఫుల్ అక్యూపెన్సీ తో నడుస్తుండడంతో, దాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తుండడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం సినీ అభిమానులపై పెను భారం కానున్నది.
ఇంతకీ విషయమేంటంటే ! ప్రభుత్వాలు సినీ టికెట్స్ రేట్లను పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.దీనితో కొంతమంది బడా నిర్మాతలు యువత ఎక్కువగా ఆసక్తి చూపే మల్టీప్లెక్స్ టికెట్ రేట్లను అమంతాం 350 రూపాయిల దాకా పెంచేశారు.ఇప్పటికే ఇంటర్ వెల్ లో తీసుకునే స్నాక్స్,పార్కింగ్ ఫిజ్ లతో సినీ అభిమానులను దోచుకుంటున్న థియేటర్ యాజమన్యలు,వాటిని లీజ్ కు తీసుకొని నడుపుతున్న నిర్మాతలు ఇవి చాలవన్నట్టు మళ్ళీ టికెట్ ల రేట్లను పెంచి కరోనా సమయంలో ప్రజలను దోచుకుంటున్నారు.
ఇక ఈ తతంగాన్ని నిశితంగా గమనిస్తున్న విశ్లేషకులు ప్రస్తుతం
థియేటర్ బిజినెస్ నామమాత్రంగా నడుస్తుంది.ఇలాంటి సమయంలో మీరు ఇలాంటి పనులు చేస్తే జనాలు థియేటర్ లను వదిలి ఓటిటిలను ఆశ్రయిస్తారు.అది ఇండస్ట్రీకి శుభ పరిణామం కాదని, దీన్ని అందరూ గుర్తుంచుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.