
హీరో రాజశేఖర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై రాజశేఖర్ కారు బోల్తా పడింది. శంషాబాద్ దగ్గరలోని పెద్ద గోల్కండ దగ్గర అదుపు తప్పిన కారు బోల్తా పడింది. రాజశేఖర్ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. టీఎస్ 07 ఎఫ్‌జెడ్ 1234 నెంబరు కలిగిన లగ్జరీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.



