Thursday, August 18, 2022
HomeEntertainmentMovie Updatesసుకుమార్ కోసం వారిని కొట్టిన బన్నీ

సుకుమార్ కోసం వారిని కొట్టిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన మిత్రుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్నారు.ప్రస్తుతం బన్నీ ఈ చిత్ర షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తుంది.ఈ చిత్రంలో జగపతి బాబు,ప్రకాష్ రాజ్,సునీల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం.

పక్క మాస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొండపైన 500 మంది ఫైటర్స్ తో ఒక ఫైట్ ను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారట.ఆ ఫైట్ పుష్ప చిత్రానికే హైలైట్ గా నిలవనున్నదట.ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈమధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూ లో రివిల్ చేశారు.ప్రస్తుతం వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ ఏడాది ఆగస్ట్ 13న రానున్నది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments