ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాకు చెందిన గౌరవ్‌శర్మ అనే వ్యక్తి 2018లో అదే గ్రామానికి చెందిన ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేశాడు.ఈ విషయంపై అమ్మాయి తరుపు కుటుంబసభ్యులు అతన్ని హెచ్చరించినా అతను తను తీరు మార్చుకోలేదు. దీనితో బాధితురాలి తండ్రి గౌరవ్ శర్మపై కేసు నమోదు చేశాడు.
దీనితో గౌరవ్ శర్మకు శిక్ష పడింది.ఒక నెల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన గౌరవ్‌శర్మ తన బుద్ధిని మార్చుకోకుండా బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం మొదలుపెట్టాడు.దీనితో ఇరు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
తాజాగా గౌరవ్ శర్మ భార్య,అత్త కలిసి గుడికి వెళ్ళారు.అక్కడ బాధితురాలిని చూసిన గౌరవ్ శర్మ భార్య,అత్త ఆమెతో వాగ్వాదానికి దిగారు.ఈ విషయాన్ని భార్య ఫోన్ చేసి గౌరవ్ శర్మకు తెలియజేయడంతో అక్కడికి చేరుకున్న గౌరవ్ శర్మ అక్కడ పెద్ద గొడవ సృష్టించారు.విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి కూడా అక్కడికి చేరుకున్నాడు.గొడవ ముదరడంతో గౌరవ్ శర్మ కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులలో బాధితురాలి తండ్రి తీవ్రంగా గాయపడ్డారు.ఆయన చికత్స్ పొందుతూ మరణించాడు.
బాధితురాలు గౌరవ్ శర్మ కు శిక్ష పడాలని తమకు న్యాయం జరగాలని కోరింది.