Monday, May 23, 2022
HomeNewsతెలంగాణ రాకుంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యేవాడా

తెలంగాణ రాకుంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యేవాడా

Harish Rao Fire on bandi Sanjay :

రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గం, లింగారెడ్డిగూడలో 100 పడకల ఆస్పత్రికి భూమిపూజ
తెలంగాణ రాకుంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యేవాడా, రేవంత్ చీఫ్ అయ్యేవాడా.
జీవితాంతం వాళ్ళు కేసీఆర్ కు రుణపడి ఉండాలి
ఈ పార్టీలు చివరి వరకు తెలంగాణ రాకుండా పని చేశాయి. ఇవ్వకుండా సతాయించాయి.
అధికార యావ తప్ప ఒక్కడు అన్న తెలంగాణకు ఏం కావాలో మాట్లాడరు
గద్వాలలో పాదయాత్ర చేస్తుంటే నీకు కర్ణాటక నుంచి వచ్చి దరఖాస్తు ఇస్తున్నారు.
రాయచూర్ బిజెపి ఎమ్మెల్యే తెలంగాణ పథకాలు మా దగ్గర అమలు చేయాలని, లేకుంటే తెలంగాణలో కలపాలని అన్నరు
బండి సంజయ్ కాదు తొండి సంజయ్.. బిజెపి అంటే.. భారతీయ జూటా పార్టీ.. బడా జూటా పార్టీ.
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన నాయకులు కేసీఆర్
దక్షిణాది రాష్ట్రాల్లో gsdp లో నెంబర్ వన్ గా నిలిచాము.
కెసిఆర్ రైతులకు ఫ్రీ కరెంటు ఇచ్చినట్టు దేశంలో ఏ బిజెపి ప్రభుత్వమైనా ఫ్రీ కరెంటు ఇస్తున్నదా.. బండి సంజయ్ సమాధానం చెప్పు.
పాదయాత్ర చేస్తూ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నరు.
మేము అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టు చేస్తామని ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ అన్నారు
బండి సంజయ్ నీకు అంత సీన్ లేదు..మీతోని ఏం కాదు. వచ్చే ఆరు నెలల్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్ళు పోయించి చూపిస్తాం.
తెలంగాణలో బిజెపి కి స్థానం లేదు. ఎంతసేపు ఉత్త మాటలే.
వికలాంగులకు 3016 పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే.
రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు మేలు చేయడం లేదు. హాని చేస్తున్నాయి.
పాలమూరు మీద కాంగ్రెసు వాడు కోర్టులో కేసు వేశాడు
బిజెపి వాడు కాలేశ్వరం మీద కేసు వేస్తాడు.
బాయుల కాడ మీటర్ పెట్టాలంటే. మేము పెట్టము అని సీఎం చెప్పారు. ఏపీలో జగన్ సంతకం పెట్టిన పైసలు తెచ్చుకున్నాడు
నా గొంతులో ప్రాణం ఉండగా నేను ఒప్పుకోను అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రు. 25 వేల కోట్ల రూపాయల ఆశ చూపి రైతు మెడకు ఉరి తాడు వేయాలని బీజేపీ చూసింది.
నీ పైసలు అవసరం లేదు. నా రైతుల శ్రేయస్సు ముఖ్యమని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారు.
చత్తీస్గఢ్లో వడ్లు కొనడం చాత కాదు.. ఇక్కడికి వచ్చి కొంటరట రాహుల్ గాంధీ. డిక్లరేషన్ ఇస్తాడట.
అధికార మైతే రానీ.. ఎగ్గోట్టుడు ఎంతసేపు అన్నటు ఉంది రాహుల్ గాంధీ వ్యవహారం.
మాటతప్పని పార్టీ.. మడమ తిప్పని పార్టీ.. టిఆర్ఎస్ పార్టీ.
ప్రతిపక్షంలో ఉంటే జై తెలంగాణ. అధికారంలో ఉంటే నై తెలంగాణ. ఇది కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి.
తెలంగాణకు పనిచేసే పార్టీ కావాలా తెలంగాణ హాని చేసే పార్టీ కావాలా.
ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు హాని చేయాలని చూస్తున్నాయి.
జాతీయ పార్టీలకు 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రాష్ట్రం. కానీ మనకు తెలంగాణ ఒక్కటే రాష్ట్రం. ఈ ఒక్క రాష్ట్రం అభివృద్ధి మన లక్ష్యం. సీఎం కేసీఆర్ స్వప్నం(Harish Rao Fire on bandi Sanjay).
ఈ కార్యక్రమంలో మంత్రి సబిత ఇంద్రా రెడ్డి, ఎమ్మేల్యేలు అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

AllEscort