5.1 C
New York
Sunday, May 28, 2023
HomeLifestyleDevotionalసంప్రదాయ రీతిలో హనుమజ్జయంతి వేడుకలు

సంప్రదాయ రీతిలో హనుమజ్జయంతి వేడుకలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

తెలంగాణ లోని ప్రాచీన పుణ్య క్షేత్రాలలో నొకటియై, పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసి, పలు దేవాలయాల సముదాయంతో అలరారుతున్న పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో శనివారం హనుమజ్జయంతి వేడుకలు సంప్రదాయ రీతిలో జరిగాయి. అంజనీ పుత్రుడైన మారుతి శరణు ఘోషలు, జయజయ ధ్వనాలు, భగవ న్నామ స్మరణలు, భక్తి సంగీతాలు, వేద మంత్రాలతో సనాతన క్షేత్రంలో భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. ఉదయాత్పూర్వం ప్రత్యే కించి హన్మాన్ దీక్షాపరులు పవిత్ర గోదావరిలో మంగళ స్నానా లను ఆచరించి, నదీతీరాన గోదా వరీ భద్రానదీసంగమ స్థానాన వెలసిన దక్షిణాభిముఖుడైన భక్తాంజనేయ స్వామిని దర్శించు కున్నారు.
చారిత్రిక, పౌరా ణిక నేపథ్యాన్ని కలిగిన ఈ ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలనుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మన్యుసూక్త సంపుటి, సుందరాకాండ పారాయణాది ప్రత్యేక పూజలను అనువంశిక అర్చకులు మధ్వాచారి రాంకిషన్ శర్మ ఆద్వర్యంలో సాంప్రదాయ వేదోక్త రీతిలో నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాంతర్గత ఆంజనేయస్వామి ఆలయంలో దేవస్థాన అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి, కళ్యాణ్, కార్తీక్, వేద పండితులు బొజ్జ
రమేష్ శర్మ ఆధ్వర్యంలో, ఈఓ శ్రీనివాస్, ఐ. రామయ్య నేతృత్వంలో, ప్రత్యక్ష పర్య వేక్షణలో, శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం , సుందరాకాండ పారాయణం లతో ప్రత్యేక పూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ, ప్రవీణ్ కుమార్, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య, స్థానిక వేదపండితులు మధు శంకర్ శర్మ , అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి , కళ్యాణ్ కుమార్ , నంబి అరుణ్ కుమార్, బొజ్జ రాజగోపాల్ , రెనవేషన్ కమిటీ చైర్మన్ ఇందారపు రామయ్య, సభ్యులు అక్కనపల్లి సురేందర్, పల్లెర్ల సురేందర్, వేముల నరేష్, గునిశెట్టి రవీందర్, వీరవేణి కొమురయ్య, ఇనగంటి రమ వెంకటేశ్వర రావు, అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.. అలాగే చింతామణి చెరువు కట్ట సమీపాన అంజన్న సన్నిధిలో బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్ శర్మ, వేదవిదులు…కలశ గణపతి పూజ, పుణ్యాహ వాచనం, పురుష సూక్త, షోడశోపచార పూజలు, రుద్రా భిషేకం, మన్యుసూక్త, పురుషసూక్త, లక్ష్మీసూక్త పంచోపనిషత్ యుక్త అభి షేకాలు, అష్టోత్తరశతి నామార్చనలు, సుందరాకాండ పారాయణాలు, సప్తహారతులు, మంత్రపుష్పాది కార్యక్రమాలను నిర్వహించారు.
ఉపవాస దీక్షాదక్షులైన హన్మాన్ భక్తులు దేవస్థానంలో దర్శనాలు చేసుకుని, ప్రసాదాలనుకొని, పరమాన్నాలుగా గ్రహించారు.
రామమందిరంలో తాడూరి మోహన్ శర్మ,, బలరాం శర్మ సాంప్రదాయ పూజనొనరించారు.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments