“శ్రీ రత్నగిరీశాయ గౌతమీ తీరవా సినే, ఆదినారాయణాయ శ్రీసత్య దేవాయ మంగళమ్”, తెలంగాణ ప్రాంతంలోనే అరుదైనదై, పవిత్ర గోదావరి నదీ తీరాన గుట్టపై వెలసి, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురికి 11కిలో మీటర్ల దూరాన మంచిర్యా ల జిల్లా సరిహద్దున దండేపెల్లి మండలం గూడెం వద్ద భక్తుల పాలిటి వరదునిగా వాసి కెక్కిన సర్వజన బాంధవుడైన గూడెం రమా సహిత సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 30 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగ నున్నాయి.
బ్రహ్మోత్సవాల నిర్వహణకై దేవస్థానం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, అర్చకులు, పునరుద్ధరణ కమిటీ బాధ్యులు, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాల నిర్వహణకై తగు ఏర్పాట్లు గావిస్తున్నారు.
గోదావరి తీరాన ఒక గుట్టపై సత్యనారాయణ స్వామి, అదే ప్రాంతంలో పక్కన ఎత్తైన ప్రదేశంలో అయ్యప్ప స్వామి వెలసి, తెలంగా ణలో అపర అన్నవరంగా, మరో శబరిమలైగా పెరిన్నకగన్న గూడెం గుట్ట విశేష ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా జనవరి 30వ తేదీన మాఘ శుద్ధ నవమి సోమ వారం ఉదయం 11.10 గంటల నుండి నిత్యవిధి, ప్రబోధిక ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్ఠి, విశ్వక్సేనారాధన, దీక్షా కంకణ ధారణ తదితర సాంప్రదాయ వేదోక్త కార్యక్రమాలతోపాటు వారం రోజులపాటు 24గంటలు అహోరా త్రాలు భజన కార్యక్ర మాలు నిర్వహించ నున్నారు. ఫిబ్రవరి 1,2 తేదీలలో దశమి, ఏకాదశులు మంగళ బుధ వారాలలో నిత్యవిధి ప్రబోధిక ఆరగింపు, తీర్థ ప్రసాద వినియోగం, విష్ణు సహస్ర నామ పారాయణాలు, 2న ద్వాదశి గురు వారం నాడు వాసుదేవ పుణ్యాహ వాచనం, విశ్వక్సేనారాధన, రుత్విగ్వరణం, అంకు రార్పణ, ధ్వజారోహణం, వటాధివాసం, సాయంత్రం సామూ హిక కుంకుమార్చనలు, గోధూళి మహూర్తంలో స్వామివారి కళ్యాణం, 3న త్రయోదశి శుక్ర వారం ఉదయం 8గంటల నుండి స్ధాళిపాకం, పంచసూక్త హవనాలు, బలి హరణం, 4న చతుర్దశి శని వారం నవగ్రహ హోమాలు, బలిహరణాలు, 5న ఆది వారం వారం పౌర్ణమి సందర్భంగా నిత్య విధి హోమం, ప్రబోధిక ఆరగింపు, తీర్థ ప్రసాద వితరణలు, జయాది హోమాలు, శాంతి హోమం, మధ్యాహ్నం 1.00 గంటకు పూర్ణాహుతి, బలిహరణం, సాయంత్రం 6గం.కు స్వామి వారి సేవా ఉత్సవం, 6న పాడ్యమి సోమ వారం నాడు ఉదయా త్పూర్వం రథోత్సవం, 10గంటలకు సప్తాహ భజన సమాప్తి, రాత్రి 7గంటలకు ఏకాంతోత్సవం తదితర ముఖ్య కార్యక్రమాలను నిర్వహిస్తు న్నామని, భక్తులకు వలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ వివరించారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనే భక్తులు 500 రూపాయలు ఫిబ్రవరి 2లోగా చెల్లించాలని, అట్టివారికి ఉత్తరీయం 2కణుముల శేష వస్త్రములు, కళ్యాణ లడ్డూ ప్రసాదాదులు అందజేయ బడునని వివరించారు. కోవిద్ సందర్భంగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. కళ్యాణంలో భాగస్వాము లయ్యే భక్తులందరికి భోజన వసతి కల్పిస్తున్నామని, అన్నదానానికి దాతలకు అవకాశం కల్పిస్తు న్నామని ఈ ఓ శ్రీనివాస్ వివరించారు.
అపర అన్నవరం…మరో శబరి మల
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES