
మనిషికో మూడు చెట్లు సాదడమే.. గ్రీన్ ఛాలెంజ్ స్పూర్తి
పెద్ద ఎత్తున పాల్గొన్న టీవీ ఆర్టిస్టులు
ప్రపంచానికి ఆకు పచ్చని సోయి నింపుతున్న గ్రీన్ ఛాలెంజ్
తెలంగాణ ప్రభుత్వ హరితహారం కార్యక్రమానికి ఆదర్శంగా కార్యక్రమం
హరా హైతో భరా…
అనే పిలుపుతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న గ్రీన్ ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్ మాకెంతో స్పూర్తి నింపింది – టివీ నటుల సంఘం
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ మొక్కలు నాటడం పెంపకం కార్యక్రమంలోభాగంగా…
ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (ఎఎటీవీ) సభ్యులు ఆదివారం ఉత్సాహంగా పాల్గొన్నారు. డా.వినోద్ బాల, విజయ్ యాదవ్, కాదంబరి కిరణ్ గార్ల ఆధ్వర్యంలో
బంజారా హిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్ ఎమ్సీ పార్క్ లో జరిగిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రతి టీవీ కళాకారుడూ మూడు చెట్ల చొప్పున నాటి తిరిగి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎఎటిటి సభ్యులు , టీవీ ఆర్టిస్టులు.. లోహిత్, శ్రీహరి, భార్గవ, శశాంక, నాగమణి, విజయ్ రెడ్డి, వా