Thursday, December 8, 2022
HomeLifestyleLife styleఉదార జాతీయ వాది... మితవాది గోఖలే......

ఉదార జాతీయ వాది… మితవాది గోఖలే……

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

స్వాతంత్య్ర సమరంలో తెర ముం దు కనిపించి, పోరాట యోధులు గా, త్యాగ ధనులుగా, ప్రజా నాయ కులుగా చరిత్ర పుటలకు ఎక్కిన వారు కొందరైతే, సమర నేపథ్యంలో తెర వెనుక నిశ్శబ్దంగా కార్యకలా పాలు సాగించిన వారెందరో. లక్ష్యం ఒకటే స్వాతంత్ర్య సాధన. మార్గా లు, కార్యాచరణ మార్గాలు వేరు. స్వాతంత్య్ర సమరంలో నిరంతరం కదలాడుతూ, గాంధీజీ, నేతాజీ, తిలక్‌, లాలాలజపతి రాయ్‌, టంగు టూరి ప్రకాశం లాంటి యోధులు ముందు వరుసలో ఉంటే, నిశ్శబ్దం గా, నిర్మాణాత్మకంగా, ఆచరణా త్మకంగా ఉద్యమాలకు ఊపిరిపోసి, లక్ష్య సాధనలో తమ జీవితాల్ని జాతికి ధారపోసి, తెర వెనుక నిలిచిన వారెందరో… అలాంటి తెర వెనుక కార్యసాధకులలో అగ్రగణ్యు లు గోపాలకృష్ణ గోఖలే. ఆయన ఆంగ్లంలో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయా లను అవగాహన చేసుకున్నారు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నారు. భార తీయ, పాశ్చాత్య సంస్కృతుల మధ్య సమన్వయకర్తగా నిలిచిన గోపాలకృష్ణ గోఖలేను అటు శ్వేత జాతి పాలకులు, ఇటు దేశీయ అధిక సంఖ్యాక నేతలు విశ్వసిం చారు. అలాంటి భిన్న వ్యక్తిత్వ కారణంగానే గాంధీ, ముహమ్మద్ అలీజిన్నా లాంటి వారిని ఆకట్టు కొని, వారిని తమ రాజకీయ ‘గురువు’ గా భావించేలా చేసింది. గోపాలకృష్ణ గోఖలే (మే 9, 1866 – ఫిబ్రవరి 19, 1915) మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలోని కోట్లుక్‌లో 1886 మే 9న ఒక సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించా రు. విశ్వవిద్యాలయ స్థాయి విద్యను అభ్యసించిన తొలితరం భారతీ యులలో ఆయన ఒకరు. జస్టిస్ రణడే శిష్యరికంలో భారతీయ అర్ధశాస్త్రాన్ని అభ్యసించి, పూనా లోని ఫెర్గూసన్‌ కళాశాలలో చరిత్ర, రాజకీయార్థ శాస్త్ర ఆచార్యునిగా చేరారు. తరువాత ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ అయ్యారు. ఆ సమయం లోనే ఆయన పదవికి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1900 సంవత్సరంలో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన గోఖలేకి అక్కడ ఫిరోజ్‌షా మెహతా సహచర్యం లభించింది. 1902 లో వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుల య్యారు. ఆ సమయంలో అస్తవ్యస్త తమై ఉన్న భారత ఆర్ధిక వ్యవస్ధ గురించి గోఖలే ఉపన్యసించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. ఆయన లోని ఆర్ధిక వేత్తను ప్రంపంచానికి పరిచయం చేసింది. 1905 లో బెనారస్‌లో జరిగిన కాంగ్రెస్ సమావే శాల్లో అధ్యక్షుడిగా ఎన్నికైనపుడు గోఖలే చేసిన ప్రసంగం నేటికీ అత్యు త్తమ ప్రసంగాలలో ఒకటిగా కీర్తించ బడుతోంది.1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. గొప్ప విద్యావేత్త గాను, పార్లమెంటే రియన్‌ గాను ఘనమైన చరిత్ర ఉంది.1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటుచేశాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించ కున్ననూ భారతీయు లలో జాతీయతా భావాన్ని పెంపొందించ డానికి విశేష కృషి చేశారు.విదేశాలలో వున్న భారతీయుల హక్కుల సాధన పట్ల శ్రద్ద క్రమంలో, దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కు ల పరిరక్షణ కోసం ఉద్యమిం చిన గాంధీ పరిచయం అయ్యారు. అలా వారి పరిచయం గురుశిష్యుల బంధంగా అభివృద్ధి చెందింది.భారతదేశంలో రాజ్యాంగ సంస్కర ణల ప్రక్రియకు ఊతం అందించిన మాంటెగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ చట్ట రూప కల్పనలో, బెంగాల్‌ విభజన జరిగిన సందర్భంలో, భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రలో, బ్రిటిష్‌ ఇండియా చరిత్రలో గోఖలే పాత్ర ఎన్నదగినది. (1905) కాశీలో జరిగిన కాంగ్రెస్‌ వార్షిక సభలలో విదేశీ వస్తు బహిష్కరణ వంటి కీలక నిర్ణయం తీసుకున్న సభలకు అధ్యక్షునిగా గోఖలే ఉండడం గమనార్హం. బ్రిటిష్ పాలనకు విధేయత చూపిస్తూ దేశ వ్యవహారాలను నడిపించడంలో ఆయన మితవాదిగా ముద్ర వేసుకు న్న నేపథ్యం. సైద్ధాంతిక భేదాలు ఉన్నా, గోఖలే తన ప్రత్యర్థులతో స్నేహపూర్వక సంబంధాలు కొన సాగించారు. బొంబాయిలో, గోఖలే… బ్రిటిష్ ప్రభుత్వ కఠినమైన భూ ఆదాయ విధానాలను వ్యతిరేకించారు. ఉచిత మరియు నిర్బంధ ప్రాధమిక విద్యను సమర్థించారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడ టానికి వెనకాడలేదు. గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ని స్థాపించారు. గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (గోఖలే ఇన్‌స్టిట్యూట్ అనే పేరుతో ప్రసిద్ధి). భారత్ లో ప్రాచీన ఆర్థికశాస్త్ర విద్యాలయం. ఇది మహారాష్ట్ర పుణె లోని జింఖానా ప్రాంతంలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారి ఆర్థిక సహాయముతో స్థాపించబడిన విద్యాలయం. నేటికినీ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారే ఈ విద్యాలయానికి ట్రస్టీలు.గోఖలే పిలుపు మేరకే గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికాను వీడి శాశ్వతంగా భారత దేశానికి వచ్చారు. పలువురిని ప్రభావితం చేసిన గోపాల కృష్ణ గోఖలే గాంధీజీ వచ్చిన దాదాపు నెల రోజులకే ఫిబ్రవరి 19, 1915న గోఖలే తుదిశ్వాస విడిచారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments