
ఆందోళనలో అకౌంట్ హోల్డర్లు
జి మెయిల్ ఉన్నట్టుండి క్రాష్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఖాతాలు స్థంభించిపోయాయి. వాటికి అనుసంధానంగా ఉన్న యూట్యూబ్ చానెల్స్ సైతం కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల సంఖ్యలో ఖాతాలు పనిచేయకపోవడంతో యూజర్లు కంగారు పడుతున్నారు. 24 గంటల వరకూ గూగుల్ ఖాతాలు పనిచేయకపోవచ్చనేది ఒక అంచనా. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యూజర్లు సామాజిక మాధ్యమంలో పెడుతున్న పోస్టుల ఫొటోలు ఇక్కడ జత చేస్తున్నాం. కొందరైతే తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయేమోనని ఆందోళన చెందుతున్నారు.
