Wednesday, November 30, 2022
Homespecial Editionఅసమాన సేవా తత్పరుడు జనరల్ తిమ్మప్ప

అసమాన సేవా తత్పరుడు జనరల్ తిమ్మప్ప

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండిజనరల్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య భారత సైన్యంలో ఒక విశిష్ట సైనికుడు. అయన 1957 నుండి 1961 వరకు భారత చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో భారత సైన్యంలో ఛీఫ్ ఇన్ ఆర్మీ స్టాఫ్‌గా కీలకమైన సేవలను అందించారు. రెండవ ప్రపంచ యుద్ధం పదాతి దళానికి నాయకత్వం వహించిన ఏకైక భారతీయుడు. ఆయన భారత సైన్యం అందించిన విశిష్ట అధికారిగా గుర్తింపు పొందారు. కొరియా యుద్ధం తరువాత, యుద్ధ ఖైదీలను వారి వారి దేశాలకు తిరిగి పంపే పనిలో ఐక్యరాజ్య సమితి విభాగానికి నాయకత్వం వహిం చారు. ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన తరువాత 1964 జూలై నుండి డిసెంబరు 1965 వరకు సైప్రస్ దేశంలో ఐక్యరాజ్య సమితి శాంతి సంరక్షక దళానికి కమాండ ర్‌గా నియమించ బడ్డారు. సైప్రస్ లో 18 డిసెంబరు 1965లో మరణించారు.

ఆయన కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా (పూర్వపు పేరు కూర్గ్) మద్దికెరి గ్రామంలో 1906, మార్చి 30వ తేదీన తిమ్మయ్య సీతమ్మ దంపతులకు జన్మించారు. తల్లి సీతమ్మ విద్యావంతురాలు, సంఘ సేవకురాలు. ఆమెకు బ్రిటిష్ ప్రభు త్వం కైసర్ – ఎ- హింద్ బిరుదును ప్రదానం చేసింది. ఆయ న అన్న పొన్నప్ప, తాను, తమ తమ్ముడు సోమయ్య ముగ్గురూ భారత సైన్యం లో అధికారులుగా పనిచేశారు. మెరుగైన విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో తన 8వ యేటనే తమిళ నాడు రాష్ట్రం కూనూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరారు. ఆ తర్వాత బెంగళూరు లోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూలులో చదివారు. ప్రాథమిక విద్య ముగిసి న తరువాత డెహ్రాడూన్ లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్ ఇండియన్ మిలటరీ కాలేజీ (RIMC)లో చేరారు. అక్కడి నుండి పట్టా పొందిన తరువాత ఆయన ఇంగ్లాండు లోని రాయల్ మిలటరీ కాలేజీకి తర్వాత శిక్షణ కోసం ఎంపిక చేయ బడ్డారు.

మిలటరీ శిక్షణ తరువాత 1926 ఫిబ్రవరి 4న అయనను బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సెకండ్ లెఫ్ట్‌నెంట్‌గా నియమించారు. ఆ బ్యాచ్‌లో నియమింప బడిన వారిలో ఆయన తరువాత ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేసిన ప్రాణ్ నాథ్ థాపర్ ఉన్నారు. తిమ్మయ్య 19వ హైదరాబాద్ రెజిమెంట్‌కు చెందిన 4వ బెటాలియన్‌లో 1927 మే 28 న నియమించ బడ్డారు. 1928 మే 4 న ఇతడు లెఫ్ట్‌నెంట్‌గా పదోన్నతి పొందారు. 1930లో రెజిమెంటల్ సహాయాధికారిగా నియమించిన తరువాత తన నైపుణ్యంతో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ (నేటి పాకిస్తాన్) లోని పఠాన్ ఆదివాసీ తిరుగుబాటు దారులను అణచ గలిగారు.

1935 ఫిబ్రవరి 4న ఇతడు కెప్టెన్‌గా పదోన్నతి పొందారు. 1936 ఏప్రిల్‌లో ఇతడు మద్రాసులోని యూనివర్సిటీ ట్రైనింగ్ కార్ప్స్‌కు సహాయాధికారిగా బదిలీ కాబడ్డారు.

తరువాత ఆయనను సింగపూర్ బెటాలియన్‌కు బదిలీ చేశారు. 1941లో ఆయనను ఆగ్రాలోని హైదరాబాద్ రెజిమెంటల్ సెంటర్‌లో సెకండ్ – ఇన్ – కామాం డ్‌గా నియమించారు. తరువాత ఇతనిని క్వెట్టాలోని స్టాఫ్ కాలేజీలో శిక్షణ కోసం పంపారు. అక్కడ అయన, అయన భార్య 1935 క్వెట్టా భూకంప బాధితులకు ఎనలేని సేవలను అందించారు. 1943లో ఆయనను మేజర్ పదవి లభించింది. ఇతడు 25వ పదాతి దళానికి గ్రేడ్2 స్టాఫ్ ఆఫీసర్‌గా నియమితుడైనారు. సైన్యంలో ఆ పదవిని వరించిన తొలి భారతీ యుడు తిమ్మయ్య. పదాతి దళం అడవులలో యుద్ధ శిక్షణను పొంది రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సేనలను బర్మాలో ఎదుర్కొంది. 1944లో అయన లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పదోన్నతి పొంది బర్మాలో 8వ, 19వ హైదరాబాద్ రెజిమెంట్‌ లకు కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. 1945లో ఇతడు బ్రిగేడియర్ ర్యాంకుకు ఎదిగారు. యుద్దంలో అయన సేవలకు గుర్తింపుగా డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆర్డర్(D.S.O)ను ప్రకటించారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయనను స్వదేశానికి వెనుకకు రప్పించారు.
1947లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత పాకిస్తాన్ విభజన సందర్భంగా భారత్ పాకిస్తాన్‌ల మధ్య ఆయుధాలు, పనిముట్లు, సైన్యం పంపకాల కమిటీలో ఆయనను సభ్యుడిగా నియమించారు. దాని తరువాత సెప్టెంబర్ 1947లో మేజర్ జనరల్‌గా పదోన్నతి కల్పించి 4వ పదాతి దళానికి కమాండ్‌గా నియమించారు. 1948లో కాశ్మీర్‌లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో ఇతడు క్రియాశీలక పాత్రను నిర్వహించారు. 19వ పదాతి దళానికి కమాండర్‌గా వ్యవహరిస్తూ కాశ్మీర్ లోయ నుండి పాకిస్తాన్ సేనను తరిమికొట్టారు. షేక్ అబ్దుల్లా, బక్షి గులాం మొహ మ్మద్, జవహర్‌లాల్ నెహ్రూలతో సత్సంబంధాలను ఏర్పరచు కున్నారు.

డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలటరీ అకాడమీకి కమాండెంట్‌గా వ్యవహరించారు. ఆయనకు గల అపార అనుభ వాన్ని పరిగణనలో తీసుకుని ఐకరాజ్య సమితి… తటస్థ దేశాల రిపాట్రియేషన్ కమీషన్‌కు ముఖ్యునిగా నియమించి కొరియాకు పంపింది. ఇది చాలా సున్నితమైన, అసాధారణమైన పని కావడంతో చాకచక్యంతో నెరవేర్చ గలిగారు. ఆయన స్వదేశానికి తిరిగి వచ్చి లెఫ్ట్‌నెంట్ జనరల్ హోదాలో జనరల్ ఆఫీసర్ కమాండింగ్, సదరన్ కమాండ్‌గా 1953లో నియమితుడైనారు. 1954లో ఇతనికి భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది.ఆయన 1957, మే 7న 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలను చేపట్టారు. 1959లో అప్పటి కేంద్ర రక్షణ మంత్రి వి. కె. కృష్ణ మేనన్ తో ఏర్పడిన విభేదాల కారణంగా పదవికి రాజీనామా చేశారు. కానీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అయన రాజీనామాను తిరస్కరించడంతో పదవిలో కొనసాగారు. 35 ఏళ్ల మిలటరీ సర్వీసు పూర్తి చేసుకుని 1961 మే 7న పదవీ విరమణ చేశారు.


భారత సైన్యం నుండి పదవీ విరమణ తరువాత ఐక్యరాజ్య సమితి ఆయన సేవలను మరోసారి ఉపయోగించ తలపెట్టి, సైప్రస్‌లో ఐక్యరాజ్య సమితి సేన (UNFICYP) లకు కమాండర్‌గా జూలై 1964లో నియమించింది. ఆ పదవిలో ఉన్న సమయం లోనే 1965, డిసెంబరు 17న మరణించారు. ఆయన పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం బెంగళూరుకు తరలించారు. అయన స్మృత్యర్థం బెంగళూరు, పూనే, సైప్రస్‌లోని లార్నకా నగరాలలో కొన్ని వీధులకు జనరల్ తిమ్మయ్య రోడ్ అని నామకరణం చేశారు. 1966లో రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ఇతని స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసి గౌరవించింది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments