Thursday, June 30, 2022
HomeLifestyleDevotionalఘనంగా గాయత్రి హవన యజ్ఞం

ఘనంగా గాయత్రి హవన యజ్ఞం

ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం గ్రామంలోగల శ్రీకృష్ణ గీతాశ్రమంలో సోమ వారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా గాయత్రి హవన యజ్ఞం ఘనంగా జరిగింది. శ్రీకృష్ణ గీతాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు వేముల రాజరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమా లను భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు(Gayatri Havana Yajnam). 1980 మే 24వ తేదీన శ్రీహనుమ ద్దాసు సంకల్పంచే, పూజ్యపాlదులు శ్రీశ్రీశ్రీ దయానందగిరి స్వాముల కరకమలములచే స్థాపించ బడిన ఈగీతాశ్రమం 41వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా 42వ వార్షికోత్సవ వేడుకలు గీతాశ్రమ వ్యవస్థాపకులు వేముల రాజ రెడ్డి నిర్వహణలో, జగిత్యాల శ్రీవిశ్వ గాయత్రి పరివార్ శ్రీకృష్ణాభిషేకం, పూజలు, నవ కుండ గాయత్రి యజ్ఞం, సామూహిక సంకీర్తన, శ్రీమద్భగవద్గీత సామూహిక పారాయణం, హవన యజ్ఞం, అఖండ నామ సంకీర్తన, పూర్ణా హుతి తదితర సాంప్రదాయ కార్యక్ర మాలను నిర్వహించారు.

Gayatri Havana Yajnam
Gayatri Havana Yajnam

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాసంగికుల ప్రవచనాలను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వంద లాది మంది భక్తులకు నిర్వాహకులు అన్నదానం గావించారు. కార్యక్రమములో గ్రామ సర్పంచ్ అండాలు ప్రభాకర్ రావు, ఉపసర్పంచ్ పందిరి అశోక్, ఇతర గీతా భక్తులతో పాటు బీర్పూర్, ధర్మపురి మండలాలకు చెందిన భక్తులు వందలాదిగా పాల్గొన్నారు. యజ్ఞనిర్వహణ గాయత్రీ పరివార్ జగిత్యాల, గీతాశ్రమ అద్యక్షులు వేముల రాజిరెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రముఖ గీతా ప్రచారక్ జోన్నల శంకరయ్య భగవద్గీత యొక్క గొప్పతనాన్ని వివరించారు…పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

పౌర్ణమి మంగళ స్నానాలు

గోదావరీ తీరస్థ ప్రాచీన పుణ్య తీర్ధ మైన ధర్మపురి క్షేత్రంలో వైశాఖ పౌర్ణమి పర్వదిన వేడుకలు సోమవారం వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. వైశాఖ పౌర్ణమికి పలువిధ ప్రత్యేకతలు న్నాయి. విశాఖ నక్షత్రానికి కాంతిని వ్యాపింప చేసే వైశాఖి పర్వదినం నాడు సుబ్రహ్మణ్య స్వామి అవతారం ఎత్తినట్లు చెపుతారు. బుద్ధుడు ఈరోజుననే పుట్టువు నొందడం జరిగింది. బుద్ధుడు వైశాఖ పూర్ణిమ నాడే జన్మించిందీ, గౌతముడు బుద్ధుడు అయిందీ, నిర్యాణం చెందినదీ వైశాఖ పూర్ణిమ నాడే కావడం విశేషం. వైశాఖ పౌర్ణమి నాడు శివుడు శరభావతారం దాల్చాడు. ఈనాడే కూర్మజయంతిగా పేర్కొన బడింది. వైశాఖి పౌర్ణమి పర్వ దినాన నదీస్నానం, దానధర్మా చరణ గావించడం పరిపాటి.

ఈసందర్భంగా సోమవారం నదీ స్నానం, దైవ దర్శనార్థం అధిక సంఖ్యాకులైన భక్తులు క్షేత్రానికి అరుదెంచారు. భక్తులు, యాత్రికులు, స్థానికులు ఉద యాత్పూర్వం నుండే పవిత్ర గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, నదీ పురోహితులచే సంకల్పం, దానధ ర్మాది సత్కర్మలను ఆచరించి, దైవ దర్శ నార్ధం దేవస్థానంలోని ప్రధానాల యాల ముందు బారులు తీరి నిలుచున్నారు. వేకువ జామునే ఆలయాల అర్చకులు వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో దేవస్థానం నుండి గోదావరికి వెళ్ళి, పవిత్ర నదీ జలాలను తెచ్చి, స్థానిక నాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీవేంకటే శ్వర, వేణుగోపాల, యమ ధర్మరాజ, ప్రసన్నాంజనేయ, శ్రీరామలింగేశ్వరాల యాలలో ఉదయం ప్రత్యేక అర్చనలు, పూజలు, అభిషేకాలు, కుంకు మార్చనలు, నిత్య కళ్యాణాది కార్యక్రమాలను నిర్వహించగా, అశేష భక్తజనం ప్రత్యేక పూజాదికాలు చేయించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈఓ శ్రీనివాస్, అభివృద్ది కమిటీ సభ్యుల పర్యవేక్షణలో, సిబ్బంది సహకారంతో, అర్చకులు, వేద పండితులు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు.

రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments