గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక వేత్త, నేపాల్ కి చెందిన గౌతమ బుద్ధుడు ప్రారంభించిన బౌద్ధ మతం (బుద్ధిజం) ప్రపంచంలోని పలు ప్రాంతాలకు పాకింది.. అలాగే అనేకమందికి స్పూర్తినిచ్చింది. గౌతమ బుద్ధుడు ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించాడు. మహా బుద్ధుడిగా కీర్తింపబడే బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియ రావడం లేదు(Gautama Buddha). 20వ శతాబ్దపు చారిత్ర కారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశం లోకి వస్తుంది. గౌతమ అనునది సిద్ధార్దుని ఇంటి పేరు కాదు. సిద్ధార్దుని పెంచిన తల్లి గౌతమి. అందుకు గాను ఆయనకు ఆ పేరు వచ్చింది. తండ్రి శుద్దోధనుడు, తల్లి మహామాయ (మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి), సిద్దార్దుడు గర్భమందున్నప్పుడు, మాయాదేవి, ఒక ఆరు దంతముల ఏనుగు తన గర్భములోకి కుడి వైపు నుండి ప్రవేశించినట్లుగా ఒక స్వప్నమందు దర్శించింది. అది జరిగిన పది చంద్ర మాసముల తర్వాత సిద్ధార్థుడు జన్మించాడు. శాక్య వంశాచారము ప్రకారం, గర్భావతిగానున్న మాయాదేవి, ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలు దేరింది. కానీ మార్గ మధ్యంలో, లుంబిని అనే ప్రాంతంలో ఒక సాలవృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించింది.

అనేక ఆధారాలను బట్టి, ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తుంది. అలా పుట్టిన బిడ్డకు సిద్ధార్ధుడు అని నామకరణం చేశారు. “సిద్ధార్థుడు” అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్ధార్థుడు జన్మించిన ఐదవ దినము నాడు, నామకరణం చేసి, ఆయన భవిష్యత్తుని చెప్పమని, ఎనిమిది మంది జ్యోతిష్కులని శుద్దోధనుడు ఆహ్వానించాడు. వారిలో కౌండిన్యుడనే పండితుడు… సిద్ధార్ధుడు భవిష్యత్తులో, బుద్ధుడవుతాడని జోస్యం చెప్పాడు. సిద్దార్ధుడు బాల్యం నుంచి రాకుమారుడిగా విలాస వంతమైన జీవితం గడిపాడు. శుద్దోధనుడు, సిద్ధార్జుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి తాత్విక విషయాలు గాని, సామాన్య ప్రజల కష్టసుఖాలు గాని తెలియకుండా పెంచాడు. సిద్ధార్థుడు తన పినతల్లి అయిన మహా ప్రజాపతి పెంపకంలో పెరిగాడు. సిద్దార్జునకు 16 ఏండ్ల ప్రాయము వచ్చేసరికి” వివాహ మయ్యింది. వీరికి రాహులుడనే కుమారుడు. పుట్టాడు. ఈ విధంగా సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజ భోగాలను అనుభవించాడు. మహారాజు, కుమారునకు రాజభోగాల నన్నింటినీ సమకూర్చినప్పటికీ, సిద్ధార్థుడు ప్రాపంచిక సుఖాలను
అనుభవించడం, జీవిత పరమ లక్ష్యం కాదని భావిస్తూ ఉండేవాడు. ఆయనకు గౌతముడు, మాయాదేవీ సుతుడు, మునీంద్రుడు, శాక్యముని, శాక్యసింహుడు, శౌర్చోదని, సర్వార్థ సిద్ధుడు, అని ఇతర నామాలు గలవు.

బహిక ప్రపంచపు కష్టసుఖాలు తెలియకూడదని, శు ద్దో ధనుడు ఎంత ప్రయత్నించినా, తన 29వ ఏట, ఒక రోజు, ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పిడితుడ్ని, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రథసారథి ఛన్న (చెన్నుడు) ద్వారా, ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించు కోలేడని తెలుసుకుని, తీవ్రంగా కలత చెంది, ముసలితనాన్నీ, రోగాన్నీ, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడప నిశ్చయించాడు. సిద్దార్థుడు పరివ్రాజక జీవితం గడపడానికి, తన రథసారధి ఛన్న సహాయంతో, ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ ఆయన భటులకు తెలియకుండా ఉండడానికి, గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే అపబడిందని చెప్తారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ (మహాభినిష్క్రమణ) అంటారు. సిద్ధార్ధుడు తన సన్యాసి జీవితాన్ని రాజగృహ (మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం) లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్ధార్దుని గుర్తించడంతో, బింబిసారుడు, సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని, ఆయనకు తన సింహాసనాన్ని (మహారాజు పదవిని) బహుకరించాడు. కాని ఆయన ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదట మగధ సామ్రాజ్యం కు వస్తానని మాటిచ్చాడు. తర్వాత సిద్ధార్థుడు, రాజగృహను విడిచిపెట్టి, ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు. ఆలరకలమ అనే సన్యాసి, తన బోధనలలో సిద్ధార్ధుని ప్రావీణ్యున్ని చేసి, తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని ఆ బోధనలవల్ల సిద్ధార్థుని జ్ఞానతృష్ణ తీరక పోవడంతో నిరాకరించాడు. తర్వాత సిద్ధార్థుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చక పోవడంతో, వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు(Gautama Buddha).
తర్వాత సిద్ధార్థుడు, కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్యబృందమంతా, జ్ఞాన సముపార్జన కొరకు, బాహ్య శరీర అవసరాలను (ఆహారంతో సహా) పూర్తిగా త్యజించి సాధన చేసే వారు. ఈ విధంగా సిద్ధార్థుడు. రోజుకు ఒక పత్రాన్ని గాని, ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకున్నాడు. చివరికి ఒకనాడు, సిద్ధార్థుడు, నదిలో స్నానమాచరిస్తుండగా పడిపోయాడు. అప్పుడు సిద్ధార్థుడు తను ఎంచుకున్న మార్గం సరియైనది కాదని తెలుసుకున్నాడు. సిద్ధార్థుడు ధ్యానం, అనావనసతి (ఉశ్చ్వాస, నిశ్వాసలు) ద్వారా మధ్యమ మార్గాన్ని కనిపెట్టాడు. (బహిక సుఖాలను, కోరికలను తృజించడం). ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్థుడు, బుద్ధ గయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవత్ ధ్యానం చేశాడు. కాని కౌండిన్యుడు, అతని ఇతర శిష్యులు, సిద్ధార్థుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా, క్రమశిక్షణా రహితుడుగా భావించారు. చివరకు, తన 35వ ఏట, 49 రోజుల ధ్యానం తర్వాత, సిద్ధార్జునకు జ్ఞానోదయమయ్యింది. అప్పటి నుండి గౌతమ సిద్ధార్థుడు, గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్ధుడని భావిస్తారు. జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు, మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకో గలిగాడు. వీటిని పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమంటారు. గౌతమ బుద్ధుడు, ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు.

జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, తపుస్సా, భల్లక అనే ఇద్దరు వర్తకులను తన ప్రథమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి బుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడనీ, వాటిని ఇప్పటికీ రంగూన్ లో ఉన్న ష్యూ డాగన్ ఆలయంలో భద్రపరిచారనీ ప్రజలు నమ్ముతున్నారు. తర్వాత బుద్ధుడు వారణాసిలో ఒక లేళ్ళ ఉద్యానవనంలో, కౌండీన్యుని దగ్గర, తనతో పాటూ శిష్యరికం చేసిన మిగతా ఐదుగురు సన్యాసులకు, తను తెలుసుకున్న పరమ సత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. వీరంతా బుద్దునితో కలిసి మొదటి బౌద్ధ భిక్షువులు సంఘాన్ని ఏర్పరిచారు. ఈ విధంగా “బుద్ధం, ధర్మం, సంఘం‘ అనే మూడు సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తర్వాత యాసుడు, అతని 54 మంది మిత్రుల చేరికతో బౌద్ధ మత సంఘంలోని వ్యక్తుల సంఖ్య 60 ని దాటింది. తర్వాత ముగ్గురు కశ్యప సోదరులు, వారి 200, 300, 500 మంది శిష్యుల చేరికతో బౌద్ధ మత సంఘ పరిమాణం 1000 ని దాటింది. వీరంతా బుద్దుని బోధనలను, సామాన్య ప్రజలకు బోధించడానికి ప్రపంచమంతా పర్యటించారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం, కుల, వర్గ విభజనలేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలు పెట్టారు. దీని వల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్తుల నుండి బెదిరింపులు, హత్యా యత్నాలు ఎదుర్కొన్నాడు. శుద్దొ దోధనుడు బౌద్ధ సంఘంలో చేరి శాతపన్నునిగా మారాడు. ఈ సమయంలో చాలా మంది రాజకుటుంబీకులు బౌద్ధ సంఘంలో చేరారు. బుద్ధుని సోదరులైన ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు మొదలగు వారంతా బౌద్ధ సంఘములో చేరిసన్యాసులుగా మారారు. సిద్ధార్ధుని కుమారుడైన రాహులుడు కూడా బౌద్ద మత సంఘములో చేరాడు. బుద్ధుని శిష్యులలో సరిపుత్త, మహా మొగ్గలన, మహా కశ్యప్, ఆనంద, అనిరుద్ధ మొదలగు ఐదుమంది ముఖ్యులు. వీరితో పాటూ ఉపాలి, సుభోతి, రాహుల, మహా కన, పున్న అనే ఐదుగురు సంగీత విద్వాంసులు ఉండేవారు.. బుద్దుడు మొదట స్త్రీలను సన్యాసినిలుగా తీసుకోవడానికి నిరాకరించాడు. ఆనందుని మధ్యవర్తిత్వంతో, స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి, వారికి కూడా బౌద్ధ సంఘంలో స్థానం కల్పించాడు. కానీ బుద్ధుడు, బౌద్ధ సంఘానికున్న నియమాలతో పాటు, వినయమనే కొత్త నియమాన్ని, స్త్రీలకు ప్రత్యేకంగా జతపర్చాడు. తర్వాత సిద్ధార్దుని భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారింది. మహా పరనిభాన సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతానని ప్రకటించాడు. తర్వాత, బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని భుజించాడు. అదితిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడయిన ఆనందుని పిలిచి, తన అస్వస్థతకు కారణం, కుంద ఇచ్చిన ఆహారం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి, కుందని ఒప్పించమని పంపాడు. కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణం గురించి తెలియజేయడానికి, కావాలనే నిర్మాణమొందాడని ఒక వాదన ఉంది. తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందరిని పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీ ఎవ్వరు, ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహా నిర్యాణమొందాడు. బుద్ధుని
ఆఖరి మాటలు, “All composite things Pass
away. Strive for your own liberation with
diligence”. బుద్ధుని శరీరానికి అంత్య క్రియలు
జరిపిన తర్వాత అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు. వీటిలో కొన్ని ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.
