Thursday, August 18, 2022
HomeEntertainmentMovie Updatesగంగూభాయ్ క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది - ఆలియా భట్

గంగూభాయ్ క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది – ఆలియా భట్

బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో ఆలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా ఆలియాభ‌ట్ చెప్పిన విశేషాలు..

సంజయ్ స‌ర్ ఈ పాత్రను నాకు ఆఫర్ చేసినపుడు నేను చేయగలనా? అని చాలా భ‌య‌ప‌డ్డాను. నాకు తొమ్మిదేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు సంజయ్ స‌ర్ బ్లాక్ సినిమా ఆడిష‌న్స్‌కి వెళ్లాను. ఆయ‌న నన్ను చూసి  ఇది హీరోయిన్ క్యారెక్టర్ అని అన్నారు నవ్వుతూ..అదే గుర్తొచ్చింది. నా భయాన్ని సంజ‌య్ స‌ర్‌ తో షేర్ చేసుకున్నా. దానికి ఆయన అన్నీ నేను చూసుకుంటాను అని అన్నారు. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఆయ‌న‌ ఏం చెప్తే అదే చేయాలి అని..

నేను కొంచెం స‌న్న‌గా  ఉంటాను. నా వాయిస్‌లో కూడా అంత బేస్ ఉండ‌దు. దానికోసం గుజ‌రాతీ స్టయిల్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేసాను. మంచి ఫుడ్ తిన్నాను. పాత్రకు త‌గ్గ‌ట్టుగా ఈ రెండు మార్చుకోవ‌డం కొంత ఛాలెంజింగ్‌గా అనిపించింది.

సంజ‌య్ స‌ర్‌తో సినిమా చేయడం అన్నది నా డ్రీమ్. ఆయన సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా నేను చేస్తాను. ఆయనతో పని చేయడం వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అచ్యూవ్ మెంట్‌.

నేను ఫ‌స్ట్‌టైమ్‌ కథియావాడీ సెట్ లోకి అడుగుపెట్టాకే తెలిసింది. ఇలా వుంటుదీ అని. అక్కడ నుంచి మెలమెల్లగా ఆ పాత్రలోకి మారడం మొదలుపెట్టాను. నన్ను పూర్తిగా గంగూభాయ్ గా మార్చింది ఆయనే
ఒక దశలో ఇంటికి వెళ్లాక కూడా గంగూ భాయ్ పాత్ర నన్ను వెంటాడేది. గంగూభాయ్ పాత్రను అలా మలిచిన క్రెడిట్ అంతా ఆయనదే.

ఇది స్టోరీ ఆఫ్ ఎ ఫైటర్.  మేబీ ఓ బ్యాడ్ వరల్డ్ నుంచి వచ్చినా, బాధ, ఎమోషన్, పోరాటం అన్నీ వున్నాయి. ఈ క‌థ ఎవ్వరికైనా కనెక్ట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను.

అజ‌య్ దేవ్ గన్ గారితో నటించడం అద్భుతమైన ఫీలింగ్‌. ఆయనది చాలా మంచి పాత్ర. గంగూభాయ్ జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర. ఆయన నుంచి ప్రొఫెషనలిజం కూడా నేర్చుకున్నాను.

పాన్ ఇండియన్ యాక్ట్రెస్  అవ్వాల‌నేది నా డ్రీమ్‌… శ్రీదేవి గారు నాకు ఇన్స్‌పిరేష‌న్‌. న‌టీన‌టుల‌కు భాష అడ్డంకి కాదు అని నేను న‌మ్ముతాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments