ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడిపితే ఫైన్స్ పడుతాయి అన్న విషయం అందరికీ తెలుసు కానీ చాలామంది వాటిని సీరియస్ గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.ఈ నిర్లక్ష్య ధోరణిని మార్చడానికే పోలీసులు అన్ని సిటీలలో రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తుంటారు.ఇక మెట్రోపాలిటన్ సిటీలో ఒకటి అయిన హైదరాబాద్ లో అయితే మందుబాబులను పట్టుకోవడానికి పోలీసులు రోజుకో ఏరియాలో తనిఖీలు చేస్తూ కనిపిస్తారు.
ఇక ఇలా తనిఖీలు చేసే సమయంలో పోలీసులు మనల్ని పట్టుకోవడానికి ఒక తప్పు చేస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.పవన్ పరిఖ్ ఫైల్ చేసిన రైట్ టు ఇన్ఫర్మేషన్ పిల్ కు ప్రతిగా యంత్రాంగం ఇచ్చిన సమాధానం ప్రకారం ట్రాఫిక్ పోలీసు వాహనాన్ని ఆపమని సిగ్నల్ చూపించినప్పుడు వెంటనే వాహనాన్ని పక్కకు తీసుకొచ్చి ఆపాలి.అలా ఆపిన వాహనదారుడిని ట్రాఫిక్ ఎస్. ఐ రాంక్ కంటే తక్కువ స్థాయిలో ఉన్న ఏ ఆఫీసర్ డాక్యుమెంట్స్ చూపించమని అడగకూడదు.అలాగే బండి తాళాలను కారణం లేకుండా వాహనం నుండి పోలీసులు తీసుకోకూడదు.
అలా కాకుండా ఆఫీసర్ ఎవరైనా అనుచితంగా వ్యవహరించి, మీ తాళాలను లాకుంటే దాన్ని మీరు ఫోటో తీసి అతని పై కేస్ ఫైల్ చేయచ్చు.