వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 3 ఖచ్చితంగా వేసవిలో విడుదలయ్యే మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో ఒకటి. బ్లాక్‌బస్టర్ ఎఫ్ 2కి ఫ్రాంచైజీగా ఉన్న ఈ చిత్రం ట్రిపుల్ ది ఫన్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఆడియో ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. F3 మొదటి పాట ల్యాబ్ డబ్ ల్యాబ్ డబ్ డబ్బూ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట టైటిల్‌కు తగినట్లుగానే డబ్బుకు సంబంధించినదిగా ఉంటుంది. నిజానికి ఎఫ్3 కథ ఈ డబ్బు నేపథ్యంలోనే ఉంటుంది.