పదవ తరగతి చదివే విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఉత్తరం రాస్తానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
పదవ తరగతి పరీక్షల దృష్ట్యా స్పెషల్ డ్రైవ్ పెట్టి సిద్ధిపేట జిల్లా అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సూచించారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట న్యూ హైస్కూల్ లో డాక్టర్ రాగి గంగారాం usa సహకారంతో రూ.25 లక్షలతో నిర్మించిన భోజన శాలను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
- రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ కామెంట్స్ :
- తాను చదివిన పాఠశాలకు డైనింగ్ హాల్ కట్టించి, అందరికీ ఆదర్శంగా స్ఫూర్తిగా దాత గంగారాం నిలబడ్డారని వెల్లడి.
- ఎవరైనా సరే కన్నతల్లి, చదివిన బడి, సొంత ఊరు మరచి పోవద్దనే పదానికి గంగారాం సార్ధకత చేకూర్చారని కొనియాడారు.
- ప్రైవేట్, ఇంగ్లీషు మీడియం మోజులో పడి.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గుతున్నారు.
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్య బోధన ప్రారంభిస్తాం.
- మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.7300 కోట్లు వెచ్చించి కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ సకల సౌకర్యాలు కల్పిస్తాం.
- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, వసతులు, బోధన ఉంటాయని అడ్మిషన్లు పెరిగేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలి.
- డ్యూయల్ మోడల్ లో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పుస్తకాలలో పేరాగ్రాఫ్ ఉండే విధంగా ముద్రణ చేస్తున్నాం.
- ఇప్పటికే పుస్తకాల ముద్రణ మొదలైంది. త్వరలోనే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నాం.
- పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తున్నాం.
- ఈ విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివే విద్యార్థినీలకు రూ.100 కోట్ల వ్యయంతో హెల్త్ అండ్ హైజనిక్ కిట్లు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు చేయనున్నాం.
- మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గతంలో రూ.1000 నుంచి రూ.3వేలకు పెంచాం.
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యం, పాత బియ్యంతో అన్నం పెట్టేలా డీఈఓ, ఏంఈఓ, తహశీల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టి అమలయ్యేలా చూడాలని మంత్రి ఆదేశం.
- న్యూ హైస్కూల్ విద్యార్థులకు అవసరమైన ప్లేట్లు అందించేందుకు ముందుకొచ్చిన పుల్లూరి శివకుమార్ ను మంత్రి అభినందించారు.
- న్యూ హైస్కూల్ లో పాఠశాలలో చదివే వికలాంగురాలు భార్గవికి బైక్ మోటారు, ఉన్నత విద్యకై మిట్టపల్లి గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తానని మంత్రి భరోసా.
- పరీక్షలంటే.. పండుగలా భావించాలి. పదవ తరగతి చదివే విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఉత్తరం రాస్తానని మంత్రి వెల్లడి.
- పదవ తరగతి పరీక్షల దృష్ట్యా స్పెషల్ డ్రైవ్ పెట్టి సిద్ధిపేట జిల్లా అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచన