త రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల తో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్
లకు వస్తున్న ఇన్ ఫ్లో కి అనుగుణంగా లక్షల క్యూసెక్కుల నీటిని ఆయా ప్రాజెక్టు అధికారులు
నదిలోకి వదలడం చేస్తున్నారని,వరద తాకిడి ప్రాంతాల్లో కొంత మేరకు ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు జరిగిందని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ధర్మపురి క్షేత్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పర్యటించారు.. ఈసందర్భంగా ఆయన గోదావరి
నది ప్రవాహాన్ని పరిశీలించారు. అధికారులను అప్రమత్తం చేశారు.ముమ్మరంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహిక ప్రాంతం పైన ఉన్న ప్రాజెక్టులు అన్ని నిండుకుండల్లా మారాయని దీంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతు వుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.గోదావరి పరివాహక ప్రాంతాలలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్సారెస్పీ అధికారులు, కలెక్టర్, ఎస్పీ, స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై పనిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని వరద ప్రాంతాల్లోకి అసలు వెళ్లకూడదని ఆయన కోరారు..ఆయన వెంట డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రాజేశ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, సి ఐ రమణ మూర్తి ఎస్ఐ దత్తాత్రి, కమిషనర్ రమేశ్, తహసీల్దార్ వెంకటేశ్,
ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
అందుబాటులో ఉండి అన్ని చర్యలు తీసుకోండి
నియోజక, జిల్లా కేంద్రాలలో ప్రజలకు అందుబాటులో ఉండి, వరదల వల్ల ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు అధికార యంత్రాంగాన్ని కార్యో న్ము ఖులను చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆదేశించారు. గురువారం సీఎం కేసిఆర్, ధర్మపురి క్షేత్రంలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఫోన్ లో మాట్లాడుతూ వరద పరిస్థితిని తెలుసుకుని, తగు సూచనలు చేశారు. అందుకు అనుగుణంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఎస్పీ తదితర అధికారులతో సమీక్షించారు.
