– 33,429 ఎకరాల్లో పంట నష్టం
నవతెలంగాణ-నిజామాబాద్
వారం వ్యవధిలో కురిసిన వర్షాలు.. రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 24035 మంది రైతులకు చెందిన 33.429 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు లెక్క తేల్చారు. అయితే, అనధికారికంగా మరింత నష్టం వాటిల్లినట్టు రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలతో పంటపొలాలు నీటమునిగాయి. నిజామాబాద్ కమ్మర్‌పల్లి, వేల్పూర్, ఏర్గట్ల, మోర్తాడ్ తదితర మండలాల్లో పొలాల్లో ఇసుక, మట్టి మేటలు వేశాయి. ఎకరం పొలంలో సుమారు 15-20 ట్రాక్టర్‌ల ఇసుక మేటలు వేసినట్టు రైతులు వాపోతున్నారు. పంట నష్టానికి తోడు.. ఇసుకను తొలగించేందుకు ట్రాక్టర్‌కు రూ.1000 వరకు ఖర్చవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎకరాకు సుమారు రూ.20 వేల వరకు అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
కమ్మేసిన ఇసుక మేటలు –
Date: