ఉద్యోగులకు అన్యాయం జరగదు

Date:


– త్వరలోనే భాగ్యనగర్‌, గచ్చిబౌలి సొసైటీ స్థలాలు అప్పగిస్తాం : మంత్రి కేటీఆర్‌ హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాల విషయంలో అర్హులైన ఒక్కరికి కూడా అన్యాయం జరగదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీకి సంబంధించిన భూ సమస్య పెండింగ్‌లో ఉందన్నారు. గతంలో వారికి కేటాయించిన భూమి అలాగే ఉందనీ, ఈ భూమిని ఉద్యోగులకు పంచేందుకు సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామని హామీ ఇచ్చారు. భాగ్యనగర్‌ టీఎన్జీఓ గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ ఇండ్ల స్థలాల పరిష్కారం కోసం రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో టీఎన్జీఓ కేంద్రం సంఘం అధ్యక్షులు, ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్‌, అసోసియేట్‌ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణగౌడ్‌ గురువారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ స్పందిస్తూ త్వరలోనే ఉద్యోగులకు చెందాల్సిన స్థలాలను వారికి అప్పగించేలా సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామని హామీ ఇచ్చారు. స్వరాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగికి కూడా అన్యాయం జరగదనీ, ఇప్పటి వరకు ఎంప్లాయి ఫ్రెండ్లీ సర్కారుగా ఉంటున్నామనీ, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని ఆయన అన్నారు.

The post ఉద్యోగులకు అన్యాయం జరగదు appeared first on .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

‘సలార్’ పార్ట్1 లో ఎన్టీఆర్!

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన స‌లార్ మూవీ ఎప్పుడో రావాల్సింది....

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...