Wednesday, November 30, 2022
Homespecial Editionబహుముఖ ప్రజ్ఞాశాలి ఏల్చూరి

బహుముఖ ప్రజ్ఞాశాలి ఏల్చూరి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ఏల్చూరి సుబ్రహ్మణ్యం ( ఆగష్టు 26, 1920 – ఫిబ్రవరి 25, 1995) ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రి కేయులు. సహజ కవిగా, గొప్ప వక్తగా, ఉద్యమ ప్రవక్తగా, ప్రగతి శీల భావుకునిగా, తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులు. ఆయన తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వో ద్యమ ఆద్యుల్లో ఒకరు. అభ్యుద య కవితా యుగంలో ప్రగతి శీల భావ దురంధరులైన బెల్లం కొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయు లుతో కూడి, ఏల్చూరి సుబ్రహ్మ ణ్యం వెలువరించిన తొలి కావ్యం నయా గరా కవితల సంపుటి. అలా ముగ్గురు అభ్యు దయ నయాగరా కవులలో ఏల్చూరి ఒకరుగా నిలిచారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఏల్చూరి సుబ్రహ్మణ్యం ఆగష్టు 25, 1920న రామయ్య. సుబ్బాయమ్మ దంపతులకు జన్మించారు. మద్దులపల్లి గురుబ్రహ్మశర్మ, భాగవతుల వెంకట సుబ్బారావు, అక్కిరాజు రామాపతి రావు, నాయని సుబ్బారావు తదితరుల వద్ద చిన్ననాడు విద్యా బుద్దులు నేర్చారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఇంట్లోనే ఉండి, విజయవాడ యస్.ఆర్.ఆర్ కళాశాలలో బి.ఎ. డిగ్రీ చేశారు. కవి సామ్రాట్ శిష్యుడు అయిన నందమూరి తారక రామారావు తో చిన్ననాటి నుండి స్నేహం ఉంది. అలాగే కొంగర జగ్గయ్య, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ప్రాణ స్నేహితుల్లా మెదిలారు. కుందుర్తి ఆంజనే యులు, బెల్లంకొండ రామ దాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ముగ్గురు విద్యార్థి దశలో చదువుతున్న రోజులలో పరిచయస్తులై, తరువాతి కాలంలో “నయాగరా” కవితా సంకలనం సమ కూర్పుకు కారకులు అయినారు.

.‘త్రివేణి’ ఆంగ్లపత్రిక సంపాదకులు కోలవెన్ను రామకోటేశ్వరరావు, దేశిరాజు కృష్ణశర్మ, బెల్లంకొండ రాఘవరావు, గుడిపాటి వెంకట చలం, గుఱ్ఱం జాషువాల స్ఫూర్తిని పొంది, పులుపుల శివయ్య, కొల్లా వెంకయ్యల వల్ల కమ్యూనిస్టు ఉద్య మంలో కాలూనారు. 1940 లో నరసరావుపేటలో ‘సన్యాసి’ అన్న పత్రికను స్థాపించి అనిసెట్టి సుబ్బా రావు, దండమూడి కేశవరావు, బెల్లంకొండ రామదాసు, దేవరకొండ బాలగంగాధర తిలక్ మొదలైన కవుల తొలి రచనలను ఆ పత్రికలో ప్రచురించారు. అదే సంవత్సరంలో ‘చిత్ర’ అనే పత్రికను ప్రారంభిం చారు. 1941 లో నవ్యకళా పరి షత్తును స్థాపించి అనిసెట్టి సుబ్బా రావు, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, సముద్రాల రామానుజాచార్య, దేవరకొండ బాల గంగాధర తిలక్, రెంటాల గోపాలకృష్ణ మొదలైన అభ్యుదయ కవులు సభ్యులుగా కొనసాగారు. అలా ఆయా కవుల రచనలతో 1943 లో ‘మాఘ్యమాల’ కవితా సంపుటాన్ని వెలువరించారు. శ్రీశ్రీ కవిత్వ ప్రభావ స్ఫూర్తితో 1944 ఆగస్టులో బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ముగ్గురి కృషితో కవితా సంకలనం ‘నయాగరా’ వెలువడి అభ్యుదయ సాహిత్యోద్య మంలో అచ్చయిన తొలి కవితా సంపుటంగా నిలిచి పోయింది. అనిసెట్టి సుబ్బారావు, లక్ష్మీదేవిల పెళ్ళి కానుకగా గుంటూరులో విశ్వనాథ సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కృతం అయింది.

నయాగర కవితా సంకలనంలో బెల్లంకొండ, ఏల్చూరి, కుందుర్తి ఒక్కొక్కరూ మూడేసి ఖండ కావ్యాలను రచించి 9 ఖండ కావ్యాల సంకలనంగా ప్రచురిం చారు. ఈ సంకలనంలో …కుందుర్తి ఆంజనేయులు మూడు రచనలు… జయిస్తుంది, తరువాత, మన్యంలో; బెల్లంకొండ రామదాసువి…
చెరసాల, నా గీతం, ఈ రోజున; అలాగే ఏల్చూరి సుబ్రహ్మణ్యం సంబంధిత….ప్రజాశక్తి, ఠాగూర్ చంద్ర సింగ్, విజయ ముద్ర ఖండ కావ్యాలు చేర్చ బడ్డాయి.
1956 లో తెలుగు సాహిత్యంలో ఏల్చూరి తొలి దీర్ఘ కవిత ‘నవంబరు 7’ విశాలాంధ్ర పత్రికలో వెలువడింది. తల్లావఝుల శివశంకర శాస్త్రి తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఏల్చూరి నవ్య సాహిత్య పరిషత్తు సభ్యునిగా చేరి, సమావే శాలకు హాజరయ్యారు. ప్రగతిశీల ఉద్యమాలలో పాల్గొ న్నారు. వందలాది రష్యన్ కవితలను ఆంగ్ల మాధ్యమం ద్వారా అనువదించారు. నృసింహ స్వామి పై శతకం కూడా రాశారు. శ్రీరంగం శ్రీనివాసరావు, ఆరుద్ర, అబ్బూరి వరదరాజేశ్వర రావు సంయుక్తంగా రాసిన “మేమే” కావ్యాన్ని సుబ్రహ్మణ్యంకు అంకితం ఇవ్వడం విశేషం. ఆంగ్లంలో వచ్చిన వందలాది రష్యన్ కవితలను తెలుగులోకి అనువదించారు. సోవియట్ భూమి పత్రికలో సుమారు 40వేల పేజీల అనువాద రచన చేశారు అంటే ఆయన గొప్పతనం స్పష్టం అవుతుంది. అభ్యు దయ కవిగా, అంతకు మించి కృషి పాత్రికేయుడిగా ఆయన చేసిన కృషి సాటిలేనిది.
1940 లో నరసరావుపేటలో ‘సన్యాసి’ అనే పత్రికను స్థాపించి, ప్రముఖ కవుల రచనలు ప్రచురిం చారు. పొగాకు లోకం’ (గుంటూరు) పత్రిక సంపాదకులుగా, 1941 – 42లో ఆంధ్ర సర్వస్వము సహాయ సంపాదకునిగా, 1954-56లో ఆకాశ వాణిలో స్క్రిప్టు రైటరుగా… రాయప్రోలు రాజశేఖర్, జలసూత్రం రుక్మీణనాథశాస్త్రి లతో కలిసి ఆకాశవాణికి ఎన్నో స్క్రిప్ట్‌ లందించారు. మద్రాస్‌లో సినిమా లకు పాటలు కూడా రాశారు. 1952లో సోషలిస్టు పత్రికలో, 1956లోనేత’ పత్రిక సంపాద కులుగా, 1961-1988లో సోవియ ట్ భూమి పత్రిక సంపాదక వర్గంలో, తర్వాత మద్రాసులో అభ్యుదయ పత్రిక నిర్వాహకసభ్యునిగా పని చేశారు.ప్రముఖ వేణుగాన విద్వాంసులు ఏల్చూరి విజయ రాఘవరావు ఆయన సోదరులు కాగా, సాహితీవేత్త ఏల్చూరి మురళీధరరావు ఆయన కుమారుడు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments