విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి –

Date:


– చేర్యాలలో ప్రభుత్వ పీజీ కళాశాల ఏర్పాటు చేయాలి:
– సైకిల్‌ యాత్రను ప్రారంభించిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు
నవతెలంగాణ-చేర్యాల
రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, చేర్యాల పట్టణ కేంద్రంలో పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిల్‌యాత్రను మంగళవారం చేర్యాల మండల కేంద్రంలో జెండా ఊపి నాగరాజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని కోరారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రతి సంవత్సరం విద్యార్థులకు నాలుగు జతల దుస్తులను అందించాలని తెలిపారు.
ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, అద్దె భవనంలో నడిపిస్తున్న గురుకులాల సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించి, సిద్ధిపేట జిల్లా కేంద్రంలో లాకాలేజ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రెడ్డమైన అరవింద్‌, కార్యదర్శి దాసరి ప్రశాంత్‌, ఉపాధ్యక్షులు కొండం సంజీవ్‌ కుమార్‌, ఆముదాల రంజిత్‌ రెడ్డి, సహాయ కార్యదర్శి నాచారం శేఖర్‌, సంతోష్‌, జిల్లా కమిటీ నాయకులు సుద్దాల భాస్కర్‌, మధు, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...