శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కల్యాణ సదన్ లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యాసదస్సు మరియు 44 వ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగినది. ముందుగా UTF పతాకావిష్కరణ గావించారు. అనంతరం విద్యాసదస్సు మరియు ఉద్యమ సదస్సు సభ కార్యక్రమము ప్రారంభమైనది. అలాగే యూటిప్ నాయకులూ, కార్యకర్తలతో పట్టణంలోని నాలుగు మాడ వీధులలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు.
UTF జిల్లా అధ్యక్షులు ముత్యాలరెడ్డి మాట్లాడుతూ….
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఉపాద్యాయులకు DL విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.దాని గురించి పట్టించుకోలేదని దానిని వెంచనే అమలు చేయాలని డిమాండు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు-నేడు కార్యక్రమము విజయవంతముగా జరుగుతున్నదని అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలికివసతులు కల్పిచేం విధముగా ప్రభుత్వం ముందుకువెళుతుండడం మేము స్వాగతిస్తున్నాము.

అదే విధముగా రాష్ట్రములోని అనేక పాఠశాలలోని పెండింగ్ లోఉన్న ఉద్యాగాలు భర్తీచేయాలని, అలాగే కొన్నిసంవత్సరాలుగా పెండింగు వుండే సర్వీస్ రూల్స్ రిలీజ్ చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావం నుంచి ఉపాద్యాల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నామని అన్నారు