`ప్రాణం నిలవదే.. హృదయం చాలదె..“ఈ మాయేమిటో ఒక క్షణమైన అణువంత కుదురుండదె“
అని తన మనసులోని ప్రేమ భావాన్ని ప్రేయసి తెలియజేస్తున్న ప్రియుడు గురించి తెలియాలంటే `నిన్నిలా నిన్నిలా` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు మేకర్స్. అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌లపై బీవీఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శశి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు, నా కోసం..` అనే సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్‌గా శనివారం ఈ సినిమాలో `ప్రాణం నిలవదే.. హృదయం చాలదె..` అనే సాంగ్‌ను మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. రాజేశ్ మురుగేశన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ పాటను శ్రీమణి రాయగా, యాజిన్ నిజార్, కల్యాణి నాయర్, రాజేష్ మురుగన్ పాడారు.
నటీనటులు:అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ తదితరులు
సాంకేతిక వర్గం:దర్శకత్వం: అని.ఐ.వి.శశి నిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్‌సమర్పణ: బాపినీడు.బిసినిమాటోగ్రఫీ: దివాకర్ మణిసంగీతం: రాజేశ్ మురుగేశన్‌పాటలు: శ్రీమణిడైలాగ్స్: నాగ చంద, అనుష, జయంత్ పానుగంటిఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగాలఎడిటింగ్: నవీన్ నూలిడైలాగ్స్: నాగ చందు, అనుష, జయంత్ పానుగంటిపి.ఆర్.ఒ: వంశీ కాకా
నిన్నిలా నిన్నిలా` సెకండ్ సాంగ్ ను విడుదల చేసిన దుల్కర్ సల్మాన్
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES