ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. ప్రాణానికి పెనుముప్పు! | dont neglect these symptoms| Common Symptoms That Should Never Be Ignored

Date:


posted on Jul 21, 2023 9:30AM

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. కాలేయం యొక్క ప్రధాన విధి రక్తంలో రసాయన స్థాయిలను నియంత్రించడం, అలాగే బైల్ అనే ముఖ్యమైన జీర్ణ ద్రవాన్ని ఉత్పత్తి చేయడం. అంతే కాకుండా రక్తాన్ని శుభ్రపరిచే పని, గ్లైకోజెన్ అనే చక్కెర రూపంలో శక్తిని నిల్వ చేసే పని కూడా కాలేయం ద్వారానే జరుగుతుంది. ఇంత ముఖ్యమైన భాగం దెబ్బతింటే  అప్పుడు శరీరంలో జరిగేదేంటో ఊహించండి? కాలేయం దెబ్బతింటే అది క్రమంగా మనిషి మరణానికి కారణమవుతుంది. దాని లక్షణాలను సకాలంలో గుర్తించి వాటి చికిత్స ప్రారంభించినట్లయితే, కాలేయం పూర్తీ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది ఏ సంకేతాల ఆధారంగా గుర్తించబడుతుందో, లివర్ తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకుంటే..

చాలా మంది దగ్గర లివర్ పెయిల్యూర్ అనే మాట వింటూ ఉంటాం. లివర్ ఫెయిల్యూర్ అంటే అది తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవడమే. ఇది చాలాప్రమాదకరమైన పరిస్థితి, అంటే రోగికి తక్షణ వైద్య సహాయం అవసరం అవుతుంది.  లివర్ పాడైనప్పుడు  కొన్ని లక్షణాల ఆధారంగా సమస్యను గుర్తించవచ్చు, వాటికి అనుగుణంగా నివారణ పద్ధతులను ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. కాలేయం దెబ్బతినే అవకాశం ఉన్న వ్యక్తులలో రక్తం వాంతులు, అలసట, కామెర్లు,  నిరంతర బరువు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

 ఈ సమస్యల వల్ల కాలేయం దెబ్బతింటుంది.. 

సాధారణంగా హెపటైటిస్‌ బి, లివర్‌ సిర్రోసిస్‌ వంటి వ్యాధులు ఉన్నవారిలో కాలేయం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, మద్యం లేదా కొన్ని మందులు అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం పాడైపోతుంది . నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలేయం దెబ్బతినే సమస్య అభివృద్ధి చెందడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. కాలేయం బలహీనంగా మారడంతో పరిస్థితి తీవ్రంగా మారుతుంది. 

దీన్ని ఎలా నివారించాలంటే..

కాలేయ వ్యాధి ఉన్నవారు లేదా కాలేయం దెబ్బతినే లక్షణాలను కలిగున్న వ్యక్తులు మొదట ఆల్కహాల్ తీసుకోవద్దని  వైద్యులు  సలహా ఇస్తున్నారు. ఇది కాకుండా అధిక రక్తపోటు,  మధుమేహాన్ని నియంత్రణలో ఉంటుకోవాలి సలహా ఇస్తారు.  ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడంతో పాటు ఎర్రమాంసం, చీజ్ మరియు గుడ్లు తీసుకోవడం తగ్గించుకోవాలి.

                                    ◆నిశ్శబ్ద.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

నేను సీఎం కావాలంటే మోడీ ఎన్‌ఓసీ అక్కర్లేదు

– మేం ఎవరికీ బీ టీం కాదు –  కాంగ్రెస్‌ సచ్చిన...

తెలంగాణ ఓటర్లు 3,17,32,727 –

– కొత్త ఓట్లు 17.01 లక్షలు తుది జాబితా విడుదలనవ...

15 శాతం ఐఆర్‌ ప్రకటించాలి –

– సీఎస్‌ ఓఎస్డీ విద్యాసాగర్‌కు యూఎస్‌పీసీ వినతినవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌రాష్ట్రంలోని ఉద్యోగులు,...

భూసేకరణ నోటిఫికేషన్‌కు –

– ముందు విధిగా గ్రామసభ : హైకోర్టునవతెలంగాణ బ్యూరో –...