ఈ సమస్య ఉన్నవారు పాలు తాగకూడదు! | dont Drink Milk if you have this problem| Reasons Not to Drink Milk| Health Care| dont drink milk| Avoid Drinking Milk| health tips| People with this problem should not drink milk

Date:


posted on Jul 11, 2023 9:30AM

శరీరం  మెరుగైన పనితీరుకు కారణమయ్యే అన్ని పోషకాలను కలిగి ఉండటం వల్ల  పాలు లెక్కలేనన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B12, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ A, విటమిన్ D వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంపొందించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  పాల వల్ల  ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పాలు తాగడం కొంతమందికి ప్రమాదకరం. ఏయే వ్యక్తులు పాలు ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుంటే..

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు  పాలు తాగకూడదు. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంటగా మారుతుంది. వీరు పాలను తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

లాక్టోస్ ప్రతికూలత  ఉన్నవారు పాలు తాగకూడదు. అంటే పాలు తాగడంతో  కడుపు ఉబ్బరం, అసిడిటీ లేదా వాంతులు లేదా విరేచనాలు కలుగుతుంటాయి కొందరికి. ఇలాంటి సమస్య ఉన్నవారు పాలు తాగకూడదు.

పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకున్న తర్వాత కొంతమందికి   వికారం లేదా వాంతులు అవుతాయని ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి సమస్యలు  ఉన్న వ్యక్తులు పాలు తాగకూడదు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు, వీరికి  ఒక సిప్ పాలు తాగిన తర్వాత  వికారం మొదలైపోతుంటుంది.

క్యాన్సర్ ఉన్నవారు పాలు తాగకూడదు. ప్రోస్టేట్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, అండాశయ క్యాన్సర్ అయినా, అలాంటి వారు పాలు అస్సలు తాగకూడదు.

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, మలం నుంచి రక్తం పడటం వంటి సమస్యలు ఉన్నవారు పాలు తాగకూడదు. అలాగే పాలు తాగడం వల్ల అలర్జీ ఉన్నవారు కూడా  పాలు అస్సలు తాగకూడదు.

 ఏవైనా చర్మవ్యాధులు ఉన్నా, పాలు తాగడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు లేదా ముడతలు వచ్చే ప్రమాదం ఉన్నా పాలు తాగకూడదు.  ఇవి మాత్రమే కాకుండా హృద్రోగులు పాలు తాగకూడదు.

పైన చెప్పుకున్న సమస్యలున్నవారు పొరపాటున కూడా పాలు తీసుకోకూడదు.

                                                            *నిశ్శబ్ద.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

భూసేకరణ నోటిఫికేషన్‌కు –

– ముందు విధిగా గ్రామసభ : హైకోర్టునవతెలంగాణ బ్యూరో –...

ఐక్య పోరాటానికి తలొంచిన సర్కార్‌ –

– అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి హామీ– 24 రోజుల సమ్మె...

కేసీఆర్‌కు అధిష్టానం మోడీనే

– సీట్ల సర్దుబాటు కూడా జరిగింది – బీజేపీ, బీఆర్‌ఎస్‌ పొత్తు...

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...