మళ్ళీ ఐపిఎల్ ఫీవర్ మొదలవ్వనున్నది.కాబట్టి ఈరోజు ఐపిఎల్ హిస్టరీలో మోస్ట్ వికట్స్ తీసిన కొందరు ప్లేయర్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
లసిత్ మలింగ : మొదటి నుండి ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న మలింగ మొత్తం 122 ఐపిఎల్ మ్యాచ్ లకు గాను 170 వికెట్లు తీసి టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు
అమిత్ మిశ్రా : గతంలో డెక్కన్ ఛార్జర్స్,సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన అమిత్ మిశ్రా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్నాడు.మొత్తం 150 ఐపిఎల్ మ్యాచ్ లు ఆడిన మిశ్రా 160 వికెట్లు తీసి రెండవ స్థానంలో నిలిచాడు.
పియూష్ చావ్లా : ఐపిఎల్ లో 7.87 ఎకనామితో మొత్తం 156 వికెట్లను ఖాతాలో వేసుకున్న చావ్లా ఈ ఏడాది ముంబై ఇండియన్స్ తరుపున ఆడనున్నాడు.
డ్వేన్ బ్రావో : ముంబై ఇండియన్స్,చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన బ్రావో ఐపిఎల్ లో ఇప్పటివరకు 153 వికెట్లు ను తీశాడు.
హర్బజన్ సింగ్ : ఒకప్పుడు ఇండియా టాప్ స్పిన్నర్స్ లిస్ట్ లో ఒకరిగా కొనసాగిన హర్బజన్ ఐపిఎల్ లో ఇప్పటివరకు 150 వికెట్లు తీశారు.