గత కొంతకాలంగా మంచి హిట్ కోసం తపిస్తున్న అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు.మంచి టాక్ తెచ్చుకున్నప్పటికి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రొడ్యూసర్స్ కు నష్టాలను మిగిల్చింది.ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తార్ తో ఒక చిత్రం చేయనున్నారు.ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ వీక్ నుండి ప్రారంభం కానున్నది.ఈ మూవీ షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక పెద్ద సెట్ ను వేస్తున్నట్టు సమాచారం.
ఈ మూవీలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటించనున్నది.కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో షూటింగ్ చేయడానికి టాలీవుడ్ హీరోలు సిద్దంగా లేనప్పుడు వైల్డ్ డాగ్ షూట్ లో పాల్గొన్న నాగార్జున ఆశించిన ఫలితాన్ని అందుకులేకపోయారు.సెకండ్ వేవ్ సమయంలో తన కొత్త మూవీ షూటింగ్ కి సిద్ధమవుతున్న నాగార్జున ఈ మూవీతో భారీ హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.