5.1 C
New York
Sunday, May 28, 2023
HomeNewsఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు
…………………………….
రామ కిష్టయ్య సంగన భట్ల…
………………………..



సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ కోటేశ్వర్, పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు. తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసా చార్య, శ్రీధరాచార్య, వంశీ, కిరణ్, సంతోష్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సులనందుకున్నారు. పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో
మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, జెడ్పీటీసీ అరుణ, అభివృద్ది కమిటీ అధ్యక్షుడు రామయ్య, సభ్యులు నరేశ్, రవీందర్, మహేష్, కొమురయ్య, సురేందర్, మున్సిపల్ కమిషనర్ రమేష్, వెంకటేశ్వర రావు,
దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, దేవస్థానం సిబ్బంది, పోలీ సుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళవాద్యాలు తోడురాగా, పురవీధులగుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి కచెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, శ్రీధరాచార్య, కిరణ్, సంతోష్, వంశీ, తదితరులు ప్రత్యేక అర్చనలు గావిం చారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments